Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో విజయం ఆ దేశానిదే.. నాటో డిప్యూటీ సెక్రెటరీ జనరల్ ఇంట్రెస్టింగ్ కామెంట్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్(UKraine) విజయం సాధిస్తుందని నాటో డిప్యూటీ సెక్రెటరీ జనరల్ మిర్సియా జియోనా అన్నారు. ఆ దేశంలో రష్యా సైనిక బలగాలు క్షీణిస్తున్నట్లు వెల్లడించారు. యుద్ధ సంక్షోభంతో ఇబ్బందులు....
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్(UKraine) విజయం సాధిస్తుందని నాటో డిప్యూటీ సెక్రెటరీ జనరల్ మిర్సియా జియోనా అన్నారు. ఆ దేశంలో రష్యా సైనిక బలగాలు క్షీణిస్తున్నట్లు వెల్లడించారు. యుద్ధ సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న ఉక్రెయిన్‌కు మరింత మద్దతు అందించేందుకు నాటో(NATO) అగ్ర దౌత్యవేత్తలు ఈ ఆదివారం బెర్లిన్ లో సమావేశం కానున్నారు. నాటో కూటమిలో చేరికపై ఫిన్లాండ్, స్వీడన్, ఇతర దేశాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి నాటో డిప్యూటీ సెక్రెటరీ జనరల్.. జియోనా ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఉక్రెయిన్ భూభాగంపై రష్యా క్రూరమైన దండయాత్ర పురోగతిని క్రమంగా కోల్పోతోందని జియోనా పేర్కొన్నారు. ఉక్రెయిన్ పౌరులు, సైన్యం ధైర్యసాహసాలకు పశ్చిమ దేశాల సహకారం తోడవడంతో కీవ్ ఈ యుద్ధంలో విజయం సాధించగలదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ మద్దతుదారులు ఐకమత్యంగా ఉన్నారని.. విజయం సాధించేవరకు ఆ దేశానికి సాయం చేస్తూనే ఉంటారని చెప్పారు.
నాటోలో స్వీడన్, ఫిన్లాండ్ చేరిక విషయంపై ఈ రెండు దేశాలు ఇప్పటికే నాటోకు సన్నిహిత భాగస్వాములుగా ఉన్నాయని.. తమ మిత్రదేశాలు సైతం వారి దరఖాస్తులను సానుకూలంగా స్పందిస్తాయని ఆశిస్తున్నట్లు జియోనా చెప్పారు. త్వరలో స్పెయిన్‌లో నిర్వహించనున్న నాటో శిఖరాగ్ర సమావేశానికి జార్జియా అధికారులనూ ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా నాటోలో చేరాలనుకుంటున్న స్వీడన్, ఫిన్లాండ్ దేశాలకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ షాక్ ఇచ్చారు. ఆ దేశాల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ రెండు దేశాలు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్నాయని ఆరోపించిన ఆయన.. వాటి చేరికపై తమ దేశానికి సానుకూల అభిప్రాయం లేదని స్పష్టం చేశారు.
On day 2 of #NATO #ForMin, Allies will address the latest developments in Ukraine & NATO’s response. At this moment of significant changes in European security NATO stands strong in support of #Ukraine & in defending the 1bn people in our Allied Nations.https://t.co/dj581Le411 pic.twitter.com/kwczKy8MVV
— Mircea Geoana (@Mircea_Geoana) May 15, 2022
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Andhrapradesh: కూరగాయల, చికెన్ ధరలు పై పైకి .. ఏం కొనేటట్టులేదు..ఏం తినేటట్లు లేదంటున్న సామాన్యులు