Putin: రష్యా అధ్యక్షుడికి తీవ్ర అనారోగ్యం.. బ్లడ్ క్యాన్సర్ లో బాధపడుతున్న పుతిన్..!

రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌(Putin) బ్లడ్ కేన్సర్ తో తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని బ్రిటన్‌(Britan) మాజీ గూఢచారి క్రిస్టఫర్‌ స్టీల్‌ వెల్లడించారు. అమెరికాకు చెందిన ఓ మేగజీన్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై వివరణ...

Putin: రష్యా అధ్యక్షుడికి తీవ్ర అనారోగ్యం.. బ్లడ్ క్యాన్సర్ లో బాధపడుతున్న పుతిన్..!
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 16, 2022 | 7:48 AM

రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌(Putin) బ్లడ్ కేన్సర్ తో తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని బ్రిటన్‌(Britan) మాజీ గూఢచారి క్రిస్టఫర్‌ స్టీల్‌ వెల్లడించారు. అమెరికాకు చెందిన ఓ మేగజీన్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై వివరణ ఇచ్చారు. పుతిన్ ఆరోగ్య సమస్య నయమవుతుందా.. కాదా అనే కచ్చితంగా తెలియదని, కానీ యుద్ధం పరిస్థితుల్లో అదీ ఒక భాగమేనని ఆయన అన్నారు. రష్యాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పుతిన్‌ చాలా తీవ్ర అస్వస్థతతో ఉన్నారని వ్యాఖ్యానించారు. రష్యాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తి ఒకరు కూడా పుతిన్‌ అనారోగ్యం గురించి ధ్రువీకరించారు. కేన్సర్‌ చికిత్సలో భాగంగా ఆయన వెన్నుకు శస్త్రచికిత్స జరిగిందని, ఉక్రెయిన్‌పై యుద్ధ ప్రకటనకు ముందు ఇది చోటు చేసుకుందని తెలిపారు. మరోవైపు.. రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ముమ్మరంగా దాడులు చేపట్టాయి. క్రెమెన్ చుక్ లోని చమురు శుద్ధి కర్మాగారంపై విరుచుకుపడ్డాయి. తీర నగరం మేరియుపొల్, పారిశ్రామిక ప్రాంతం డాన్‌బాస్‌లలో పట్టు కోసం ఉక్రెయిన్, రష్యా బలగాలు భీకరంగా పోరాడుతున్నాయి. డాన్‌బాస్‌లో నలుగురు, చెర్నిహైవ్‌లో ముగ్గురు, ఖర్కివ్‌లో ఇద్దరు పౌరులు మృతిచెందారు.

అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో నాటోలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కూటమిలో చేరడానికి అవసరమైన దరఖాస్తు ప్రక్రియ చేపట్టేందుకు ఫిన్లాండ్‌ సుముఖత వ్యక్తంచేసింది. స్వీడన్‌ కూడా మరికొద్ది రోజుల్లో ఈ దిశగా నిర్ణయం వెల్లడించనుంది. ఫిన్లాండ్, స్వీడన్‌లను చాచిన హస్తాలతో తాము మనసారా ఆహ్వానిస్తున్నట్టు నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ పేర్కొన్నారు. ఈ తాజా పరిణామాలపై రష్యా ఘాటుగా స్పందించింది. తమ జాతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రతీకార చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆ దేశ విదేశాంగశాఖ హెచ్చరించింది.

యుద్ధం కారణంగా రాజధాని కీవ్‌ నుంచి పోలండ్‌లోని వార్సాకు మార్చి 13న తాత్కాలికంగా మార్చిన భారత రాయబార కార్యాలయం.. తిరిగి ఈనెల 17 నుంచి కీవ్‌లో సేవలను పునఃప్రారంభిస్తుందని విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Tirupati: ఘనంగా పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు.. నేడు కన్నులపండువగా స్వర్ణ రథోత్సవం

Viral Photo: ఈ ఫోటోలో ఏడుకొండలవాడి వేషంలో ఉన్నది ఓ ఏపీ ఎంపీ.. ఎవరో గుర్తించారా..?

Vastu Tips: ఇంట్లో తులసి మొక్కను ఈ దిశలో నాటుతున్నారా? అయితే, ఇప్పుడే ఈ విషయాలు తెలుసుకోండి..!