AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: “ఆమె మృతికి కారణమయ్యారు.. వెంటనే ఆ డబ్బు చెల్లించండి”.. ఆస్పత్రికి వినియోగదారుల కమిషన్ ఆదేశం

ఇటీవలి కాలంలో వైద్య సేవల ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి. కొందరు ఆస్తులు అమ్ముకుంటుంటే, మరికొందరు మాత్రం చికిత్సకు చెల్లించేంత డబ్బు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు.. ఆస్పత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం...

Hyderabad: ఆమె మృతికి కారణమయ్యారు.. వెంటనే ఆ డబ్బు చెల్లించండి.. ఆస్పత్రికి వినియోగదారుల కమిషన్ ఆదేశం
Justice
Ganesh Mudavath
|

Updated on: May 16, 2022 | 6:33 AM

Share

ఇటీవలి కాలంలో వైద్య సేవల ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి. కొందరు ఆస్తులు అమ్ముకుంటుంటే, మరికొందరు మాత్రం చికిత్సకు చెల్లించేంత డబ్బు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు.. ఆస్పత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం వల్ల కూడా పలువురు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు.. అనారోగ్యంతో బాధపడుతున్న తమ తల్లిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారి వద్ద వివిధ రకాలుగా డబ్బు గుంజేసిన ఆస్పత్రి సిబ్బంది చివరికి ఆమె బతకదని వేరే చోటుకు తీసుకెళ్లాలని సూచించడం గమనార్హం. వైద్యసేవల్లో అందిన లోపాలతో మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై బాధిత మహిళలు వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి రోగి ప్రాణం కోల్పోవడానికి కారణమైన పద్మజా ఆసుపత్రిపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రి ఛార్జీల పేరిట వసూలు చేసిన రూ.3 లక్షలు రీఫండ్‌ చేయడంతోపాటు పరిహారం కింద రూ.10వేలు, కేసు ఖర్చుల కింద రూ.10వేలను 45 రోజుల వ్యవధిలో చెల్లించాలని ఆదేశించింది.

హైదరాబాద్ లోని మియాపూర్‌ ఆల్విన్‌ కాలనీకి చెందిన ఇద్దరు మహిళలు కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను 2021 నవంబరులో ఆశ్రయించారు. తమ తల్లిని 2020 ఆగస్టులో ఆసుపత్రిలో చేర్పించామని.. చికిత్సకు రోజుకు రూ.75 వేలు బిల్లు అవుతుందని చెప్పారని తెలిపారు. అనంతరం ఆ మొత్తాన్ని రూ.లక్షకు పెంచారని పేర్కొన్నారు. కొన్ని రోజులు సాధారణంగా ఉన్న ఆమెను ఆస్పత్రి సిబ్బంది ఐసీయూకు చేర్చాలని చెప్పి, ఇందుకు రూ.2 లక్షలు అవుతుందని చెప్పారన్నారు. వారు చెప్పిన దానికి తాము ఆంగీకరించి, ఆ మొత్తం చెల్లించిన తర్వాత బాధితురాలిని గాంధీకి తరలించాలని, లేకపోతే ఆమె బతకదని చెప్పారని ఆవేదన చెందారు.

అయితే బాధితురాలు సెప్టెంబరు 1న చికిత్స పొందుతూ మరణించింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాళ్లు.. చికిత్స అందించడంలో ఆసుపత్రి విఫలమైందని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కాకుండా అదనంగా డబ్బులు వసూలు చేశారంటూ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కమిషన్‌ ఫిర్యాదీల వాదనలతో ఏకీభవించింది. ఆసుపత్రి ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్లు రూ.3,20,000 చెల్లించాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Health Tips: ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందాలంటే డైట్‌లో ఇవి ఉండాల్సిందే..!

Shawarma Terror: షవర్మా తింటే చనిపోతారా?.. నిపుణులు చెబుతున్న ఈ విషయాలను తప్పక చూడాల్సిందే..!