- Telugu News Photo Gallery Add these foods in your diet to reduce stomach or body heat in summer in telugu
Health Tips: ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందాలంటే డైట్‌లో ఇవి ఉండాల్సిందే..!
Health Tips: మండుటెండల్లో బయటకు వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడరు కానీ కొన్ని పనుల వల్ల బయటకి వెళ్లక తప్పదు. దీని వల్ల వేడి గాలులకి గురై ఆరోగ్యం పాడవుతుంది.
Updated on: May 16, 2022 | 6:29 AM

మండుటెండల్లో బయటకు వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడరు కానీ కొన్ని పనుల వల్ల బయటకి వెళ్లక తప్పదు. దీని వల్ల వేడి గాలులకి గురై ఆరోగ్యం పాడవుతుంది. అందుకే ఎండాకాలం కొన్ని ఆహారాలని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా మంచి ఉపశమనం పొందవచ్చు.

సెలెరీ: సెలెరీ అనేది కడుపులోని వేడిని తగ్గించే ఒక కూరగాయ. దీనిని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.

గోండ్ కతీరా: ఎండాకాలం వేడి స్ట్రోక్ మిమ్మల్ని చాలా అనారోగ్యానికి గురి చేస్తుంది. ఈ పరిస్థితిలో మీరు గోండ్ కతీరా తినవచ్చు. ఇది జిగురులాంటి పదార్థం ఇది కడుపుని చల్లగా ఉంచుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ దీనిని ఎంతో ఆసక్తిగా తింటారు.

సత్తు: భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కాల్చిన శనగ పిండిని సత్తు అంటారు. కడుపులో ఏర్పడే వేడిని చల్లబరచడానికి దీనిని తినమని పెద్దలు సలహా ఇస్తారు. ఇది ఆకలి కూడా పెంచుతుంది. వేసవిలో రోజూ ఒక గ్లాసు సత్తు నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

ఫాల్స్: ఇది ఒక రకమైన తీపి, పుల్లని పండు. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది కడుపుకు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది.



