AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narketpally: నార్కట్ పల్లి హైవే పై రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.. 30మందికి గాయాలు

ఏపీ లింగోటం(A.p.lingotam) వద్ద ఈరోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే రోడ్డు పక్కన (National High way) ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొన్నది.

Narketpally: నార్కట్ పల్లి హైవే పై రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.. 30మందికి గాయాలు
Road Accident In Narketpall
Surya Kala
|

Updated on: May 16, 2022 | 5:49 AM

Share

Narketpally: నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం(A.p.lingotam) వద్ద ఈరోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే రోడ్డు పక్కన (National High way) ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నార్కట్ పల్లి ఆస్పత్రికి తరలించారు.  ఆర్టీసీ బస్సు.. భద్రాచలం నుంచి 45 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు వస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది. దీనికి డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..