Viral Video: చీలిన నాలుకతో ఆమె ఒకేసారి 2 డ్రింక్స్ టేస్ట్ చేసింది.. ఆపై రియాక్షన్ చూడండి

బ్రియన్నా తన నాలికను గతంలో రెండుగా కట్ చేయించుకుంది. సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అవుతున్న ఓ వ్యక్తి.. ఒకేసారి రెండు డ్రింక్స్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమని అడిగారు. ఆమె వెంటనే ఆ ప్రయోగం చేసింది.

Viral Video: చీలిన నాలుకతో ఆమె ఒకేసారి 2 డ్రింక్స్ టేస్ట్ చేసింది.. ఆపై రియాక్షన్ చూడండి
Brianna Mary Shihadeh
Follow us
Ram Naramaneni

|

Updated on: May 13, 2022 | 7:37 PM

Trending Video: పైత్యం పీక్స్‌కి వెళ్లినవారిని ఎవ్వరూ ఏం చెయ్యలేరు. వాళ్ల మానన వాళ్లు పిచ్చి కథలు పడుతూనే ఉంటారు. పైన ఫోటోలో కనిపిస్తున్న బ్రియన్నా మేరీ షిహాదే అనే మహిళ ఆ కోవకు చెందినవారే. ఈమె నెటీవ్ ప్లేస్ కాలిఫోర్నియా(California). ఆమె డ్రెడ్‌లాక్ ఆర్టిస్ట్. అంటే ఆమె జుట్టు దువ్వుకోరు. జుట్టును చిన్న చిన్న పాయలుగా చేసుకుంటారు. ఆ పాయలకు రంగురంగుల డైలు వేస్తూ ఉంటారు. విభిన్నమైన పూసలు, రింగులు పెట్టుకుంటారు. డ్రెడ్‌లాక్ అనేది ఓ రకమైన హెయిర్ స్టైల్ అనమాట. ఇక ఇలాంటి వ్యక్తులకు నార్మల్‌గా ఉండటం నచ్చదు. తమను తాము విభిన్నంగా చూసుకోవాలని.. అందరూ గుర్తించుకోవాలని ఆరాటపడుతుంటారు. అందుకోసం రకరకాల పనులు చేస్తుంటారు. కొన్ని రిస్కులు కూడా చేస్తారు. అందులో భాగంగా బ్రియన్నా..  తన నాలికని రెండుగా కట్ చేయించుకుంది. అందుకే ఆమె నాలుక చీలి ఉంటుంది. ఈ క్రమంలోనే  ఫాలోయర్ నుంచి బ్రియన్నాకు ఇటీవల ఓ క్రేజీ రిక్వెస్ట్ వచ్చింది. చీల్చుకున్న నాలిక ఉంది కాబట్టి… ఒకేసారి రెండు డ్రింక్స్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమని ఆ ఫాలోవర్ కోరారు. క్రేజీ థాట్ కదా.. క్రేజీ బ్రియన్నా ట్రై చేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఓ గ్లాస్‌లో మినరల్ వాటర్, మరో గ్లాస్‌లో స్ప్రైట్ లాంటి డ్రింక్ పోసుకొని… టేస్ట్ చూసింది. ఆ తర్వాత ఓ రేంజ్‌లో ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

View this post on Instagram

A post shared by ?Flower? (@flower.friendly)

బ్రిటీష్ డెంటల్ జర్నల్ ప్రకారం , నాలుకను చీల్చే ప్రక్రియ ప్రమాదకరం.  అలా చేయించుకునేవారు రక్తస్రావం, ఇన్ఫెక్షన్, నరాల దెబ్బతినే ప్రమాదాలు కలిగి ఉంటారు.

మరిన్ని ట్రేండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..