Viral Video: మానవత్వంతో మనిషికి ఏ మాత్రం తీసిపోని పిల్లి.. కళ్లులేని పావురానికి ముద్దు పెట్టి వదిలేసిన వైనం.. వీడియో వైరల్..

ఓ పిల్లికి ఓ పెద్ద బిల్డింగ్‌ పక్కన మరో ఇంటిపైన గ్రిల్‌ లాగా కొన్ని కర్రలు పేర్చి ఉన్నాయి. వాటిపైన ఓ తెల్లని పావురం వచ్చి వాలింది. ఆహారం వేటలో ఉన్న పిల్లికి ఈ పావురాన్ని చూడగానే నోరూరింది.

Viral Video: మానవత్వంతో మనిషికి ఏ మాత్రం తీసిపోని పిల్లి.. కళ్లులేని పావురానికి ముద్దు పెట్టి వదిలేసిన వైనం.. వీడియో వైరల్..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: May 15, 2022 | 4:44 PM

Viral Video: మనుషులకే కాదు.. జంతువులకు కూడా మానవత్వం ఉంటుంది.. ఈ విషయం అనేక సార్లు వెల్లడైంది కూడా.. అవును సాధారణంగా మనం రోడ్డుపైన నడుస్తున్నప్పుడు ఎవరైనా అంధులు కానీ, వృద్ధులు కానీ రోడ్డు దాటుతుంటే సహాయం చేస్తాం. ఇది మానవత్వం..మానవ సహజం కూడా. కానీ ఇక్కడ ఓ పిల్లి చేసిన పని చూస్తే మాత్రం మీరు గ్యారంటీగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా పిల్లికి ఎలుకలు, చిన్న చిన్న కోడిపిల్లలు కనిపిస్తే వెంటనే గుటకాయస్వాహా చేసేస్తుంది. అలా ఆహారం కోసం వెతుకుతున్న ఓ పిల్లికి ఓ పెద్ద బిల్డింగ్‌ పక్కన మరో ఇంటిపైన గ్రిల్‌ లాగా కొన్ని కర్రలు పేర్చి ఉన్నాయి. వాటిపైన ఓ తెల్లని పావురం వచ్చి వాలింది. ఆహారం వేటలో ఉన్న పిల్లికి ఈ పావురాన్ని చూడగానే నోరూరింది. వెంటనే దాన్ని పట్టుకోడానికి దాని ట్యాలెంట్‌ అంతా ఉపయోగించి పావురం దగ్గరకు వెళ్లింది. తీరా దగ్గరకి వెళ్లి ఆ పిల్లి ఏం చేసిందో తెలుసా… వీడియో చూడండి మీకే అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట(Social Media) తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ పిల్లి చేసిన పనికి నెటిజన్లు గ్రేట్‌ క్యాట్‌ అంటున్నారు. ఆ పిల్లిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకో తెలుసా… ఆ పావురానికి పాపం కళ్లు కనిపించవు. దాంతో పిల్లి వచ్చిన విషయం ఆ పావురం గ్రహించలేకపోతుంది. అయితే ఆ పిల్లికి అనుమానం వచ్చింది పావురం ఎందుకు అక్కడ్నుంచి పారిపోలేదు అని. పావురం దగ్గరకు వచ్చిన తర్వాత దానికి విషయం అర్ధమైంది. అంతే పావురం నుదుటిపైన ముద్దు పెట్టి అక్కడ్నుంచి వెళ్లి పోయింది. మంచి పిల్లి కదా.. ఈ ఘటన  వాయువ్య చైనాలో చోటు చేసుకుంది. పిల్లి పైకప్పు మీదుగా పావురాన్ని వెంబడించిన తర్వాత .. ఆ పిల్లి పావురాన్ని  ముద్దాడినట్లు కనిపించింది. నవంబర్ 8వ తేదీ 2021లో జిన్‌జియాంగ్ ఉయ్‌ఘర్ అటానమస్ రీజియన్‌లోని ఉరుమ్‌కి నగరంలో క్యాప్చర్ చేయబడింది. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా మానవత్వం ఉన్న పిల్లి వీడియోపై ఓ లుక్ వేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..