Telugu News Trending IAS Viral Tweet: Attention those who eat gutkha… don’t give up this bad habit or you will get these 7 rewards!
IAS Viral Tweet: గుట్కా తింటున్నారా.. మీరు ఈ బహుమతులు లభిస్తాయి.. స్పెషల్ గెస్ట్ యముడే..
ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో గుట్కా తింటే కలిగే అనారోగ్యాల గురించి తెలియజేస్తూ.. ఓ మంచి ఆలోచనతో ఈ చిత్రాన్ని పంచుకున్నారు. అతను 'గొప్ప ఆలోచన' అనే క్యాప్షన్ తో ఫోటోని షేర్ చేశారు. ఈ పోస్ట్‌ను 6 వేల మందికి పైగా లైక్ చేశారు
IAS Viral Tweet: పొగాకు ఆరోగ్యానికి హానికరం, గుట్కా తినడం, బీడీలు తాగడం, సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్ (Cancer) వస్తుందని అందరికీ తెలిసిందే. అందుకనే సిగరెట్, బీడీ ప్యాకెట్‌పై పెద్ద పెద్ద లెటర్స్ తో పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక రాసి ఉంటుంది. అయినప్పటికీ ప్రజలు, ముఖ్యంగా యువత ఆ హెచ్చరికను పట్టించుకోకుండా.. పొగాకు తాగడం ఓ ఫ్యాషన్ గా భావిస్తారు. అయితే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా.. పొగాకు తాగడం వలన కలిగే దుష్ప్రభావాలను గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో, అనేక స్వచ్ఛంద సంస్థలు సృజనాత్మక ప్రచారాల ద్వారా ఈ చెడు అలవాటును వదిలించుకోవడానికి ప్రజలకు సహాయపడుతున్నారు. ప్రస్తుతం..గుట్కా అలవాటుని వదిలించుకోవడానికి ఒక అద్భుతమైన ఆలోచన ఒకటి ( గుట్కా తినండి బహుమతులు పొందండి) సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఐడియా చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. దీన్ని ఓ ఐఏఎస్ అధికారి ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న ఫోటోలో, గోడపై రాసి ఉన్న వ్యాఖ్యలు చూడవచ్చు. ఆ పోస్టర్ లో వరసగా గుట్కా తింటే.. కలిగే అనారోగ్యాల ఒకొక్కటిగా వివరిస్తూ.. గుట్కా తినే వారికి ముందుగా వచ్చే అనారోగ్యం.. ఆ స్టేజ్ స్టేజ్ కు ఏ విధంగా శరీరంలో వ్యాధులు చేరతాయని వివరించారు.. చివరికి గుట్కా తింటే బహుమతిగా ఏడో స్థానంలో అత్యున్నత అవార్డుగా క్యాన్సర్ అని చెప్పారు. అంతేకాదు గుట్కా తినడం కొనసాగిస్తే.. బహుమతిగా రామ నామం ఇవ్వాల్సి ఉంటుందని… గుట్కాతిన్న వ్యక్తికి ఆ బహుమతిని ఇచ్చే సమయంలో యమధర్మ రాజు ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ పోస్టర్ ను ఐఏఎస్ అధికారివ్ అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వేలాదిగా లైక్స్ ను సొంతం చేసుకుంటుంది. ఇక రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రముఖ నటీనటులు గుట్కాను తినమని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. సాధారణ ప్రజలు గుట్కాకు దూరమవుతారా లేదా దత్తత తీసుకుంటారా? ప్రజలందరూ ఈ విషాన్ని వదిలి అందమైన రేపటి వైపు పయనించాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు కానీ???? అంటూ గుట్కా యాడ్ ఉన్న పోస్టర్ ని షేర్ చేశారు..