Viral Video: అమ్మో దెయ్యం కుక్క.. వీడియో చూస్తే జడుసుకుంటారు జాగ్రత్త..!
Viral Video: మనలో చాలా మంది ఆరోగ్యంగా ఉండటం కోసం, ఫిట్ ఉండటం కోసం రకరకాల కసరత్తులు చేస్తుంటారు. యోగా, వ్యాయామం వంటివి చేస్తుంటారు.
Viral Video: మనలో చాలా మంది ఆరోగ్యంగా ఉండటం కోసం, ఫిట్ ఉండటం కోసం రకరకాల కసరత్తులు చేస్తుంటారు. యోగా, వ్యాయామం వంటివి చేస్తుంటారు. ఇంకొందరు శరీరాన్ని ప్లెక్సిబుల్‌గా మార్చుకోవడానికి యోగాసనాలు, జిమ్నాస్టిక్స్ చేస్తుంటారు. శరీరం ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటే అంత చురుకుదనం కలిగి ఉంటారు. అయితే, ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రజలు యోగా, ఎక్సర్‌సైజ్‌లు చేయడం మనం చాలా వీడియోల్లో, బయటా చూస్తూనే ఉంటాం. మరి జంతువులు ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేస్తాయి? అని ఎప్పుడైనా ఆలోచించారు. అవి కూడా తమ శరీరం ఫ్లెక్సిబుల్‌గా ఉండేందుకు యోగా చేస్తాయని ఎప్పుడైనా ఊహించారా? అలాంటి సన్నివేశాలను ఒక్కసారైనా చూశారా? అయితే, ఇప్పుడు చూసేయండి.
తాజాగా ఓ కుక్క కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ వీడియోలో కుక్కను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది నిజంగా నిజమేనా? అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. సాధారణంగా మనుషులు సహా కొన్ని జంతువులు కొంత మేరకు తమ తలను వెనక్కి గానీ, పక్కకు గానీ తిప్పుతాయి. కానీ, ఈ కుక్క మాత్రం ఏకంగా 180 డిగ్రీలు తన తలను వెనక్కి తిప్పింది. ముందువైపు ఉండాల్సిన తలను ఏకబిగిన వెనక్కి తిప్పి పెట్టింది. దాంతో దాని నాలుగు కాళ్లు ముందరివైపు, తల, వెన్ను భాగం వెనుకవైపు కనిపిస్తున్నాయి. చూడటానికి చాలా విచిత్రంగా, భయంకరంగా అనిపిస్తోంది. ఇది నిజంగా నిజమేనా? అని ఆశ్చర్యపోతున్నారు. ఇంత ఫ్లెక్సిబులిటీ సాధ్యమేనా? అని షాక్ అవుతున్నారు నెటిజన్లు. కాగా, కుక్కను చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు భయపడిపోతున్నారు. ఈ కుక్కకు భూత వైద్యుడు అవసరం అని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సడెన్‌గా చూసి జడుసుకున్నామంటూ ఇంకొందరు తమ ఎక్స్‌పీరియన్స్‌ను మెన్షన్ చేస్తున్నారు. ఈ వీడియోను మే 5వ తేదీన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా.. ఇప్పటి వరకు 78 వేల మందికి పైగా లైక్ చేశారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి.
View this post on Instagram