Pallavi Dey: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. సీరియల్‌ నటి అనుమానాస్పద మృతి..

Pallavi Dey: టీవీ సీరియల్స్‌తో బెంగాల్‌లో పాపులర్‌గా మారిన నటి పల్లబిడే (21) అకస్మాత్తుగా ఆమె నివసిస్తున్న ఫ్లాట్‌లో ఉరి వేసుకుని చనిపోయింది. దీంతో ఆమె అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Pallavi Dey: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. సీరియల్‌ నటి అనుమానాస్పద మృతి..
Pallavi Dey
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: May 16, 2022 | 6:59 PM

Pallavi Dey: సినిమా ఇండస్ట్రీలో వ‌రుస మ‌రణాలు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. పుట్టిన రోజునాడే కేర‌ళ‌లోని కాస‌ర‌గోడ్‌కు చెందిన న‌టి, మోడ‌ల్ ష‌హానా అనుమానాస్పద స్థితిలో మ‌ర‌ణించగా, రియాలిటీ డ్యాన్స్ షో ఆట సీజ‌న్ 1తో పాపుల‌ర్ అయిన టీనా సాధు హఠాన్మరణం అందరినీ కలచివేసింది. తాజాగా మరో నటి మ‌రో న‌టి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. టీవీ సీరియల్స్‌తో బెంగాల్‌లో పాపులర్‌గా మారిన నటి పల్లబిడే (21) అకస్మాత్తుగా ఆమె నివసిస్తున్న ఫ్లాట్‌లో ఉరి వేసుకుని చనిపోయింది. దీంతో ఆమె అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా పల్లబిడే తన స్నేహితుడు షాగ్నిక్‌ చక్రవర్తితో కలిసి కోల్‌కతాలోని ఒక అద్దె భవనంలో నివసిస్తోంది. అయితే ఆదివారం అనుమానాస్పదరీతిలో మృతిచెందింది. తాను ఉంటున్న ఫ్లాట్‌లో ఉరివేసుకుని చనిపోయింది. షాగ్నిక్‌ షాపుకు వెళ్లి తిరిగి వచ్చేసరికి పల్లబిడే ఉరి వేసుకుని దూలానికి వేలాడుతూ కనిపించింది. దీంతో చుట్టుపక్కల వారికి ఈ విషయాన్ని తెలియజేసి ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు షాగ్నిక్‌.

మిస్టరీగా..

కాగా గత కొంతకాలంగా తన స్నేహితుడు షాగ్నిక్‌ ఫ్లాట్‌లో నివసిస్తోంది పల్లబిడే. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది మిస్టరీగా మారింది. అమీ సిరాజేర్‌ బేగం, మోన్‌మనేనా, రేష్మా జాపి, కుంజో ఛాయా, సరస్వతి ప్రేమ్‌ అనే టీవీ సీరియల్స్‌ పల్లబిడేకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆదివారం కూడా ఆమె షూటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగింది. ఘ‌ట‌నాస్థలాన్ని ప‌రిశీలించిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు న‌మోదు చేసుకున్నారు. అనంతరం మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు. కాగా ఆమె ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు పోలీసులు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యకు పాల్పడిందా ? లేక కుటుంబ తగాదాలు ఏమైనా ఉన్నాయా? వృత్తిపరంగా తలెత్తిన ఇబ్బందులు కారణమా ? అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్రేమ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. స్నేహితుడు షాగ్నిక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా పల్లవిడే గత నెలలోనే అద్దె ఫ్లాట్‌కి మారిందని తెలిసింది. ఇక తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేశారని పల్లవిడే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Sarkaru Vaari Paata collections: బాక్సాఫీస్‌పై సర్కారు వారి పాట దండయాత్ర.. మూడు రోజుల టోటల్‌ కలెక్షన్స్ ఎంతంటే..

DJ Tillu: వైజాగ్‌లో సందడి చేసిన డీజే టిల్లు.. భారీగా తరలివచ్చిన అభిమానులు..

NASA: అంగారక గ్రహంపై షాకింగ్ నిర్మాణం.. ‘ఎంట్రీ డోర్’ ను కనిపెట్టిన రోవర్..!

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!