AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NASA: అంగారక గ్రహంపై షాకింగ్ నిర్మాణం.. ‘ఎంట్రీ డోర్’ ను కనిపెట్టిన రోవర్..!

NASA: అంగారక గ్రహంపై జీవం ఉనికిపై విస్తృత పరిశోధనలు జరుపుతున్న నాసా క్యూరియాసిటీ రోవర్ ఒక అద్భుతమైన, వింత నిర్మాణాన్ని కనిపెట్టింది. అంగారక గ్రహ ఉపరితలంపై దీర్ఘ చతురస్రాకారంలో

NASA: అంగారక గ్రహంపై షాకింగ్ నిర్మాణం.. ‘ఎంట్రీ డోర్’ ను కనిపెట్టిన రోవర్..!
Rover
Shiva Prajapati
|

Updated on: May 16, 2022 | 7:50 AM

Share

NASA: అంగారక గ్రహంపై జీవం ఉనికిపై విస్తృత పరిశోధనలు జరుపుతున్న నాసా క్యూరియాసిటీ రోవర్ ఒక అద్భుతమైన, వింత నిర్మాణాన్ని కనిపెట్టింది. అంగారక గ్రహ ఉపరితలంపై దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఓపెనింగ్ బేస్మెంట్ ద్వారంలా ఆ నిర్మాణం ఉంది. ఇది ఒక గదిలోకి ఎంట్రీ మార్గం, ఒక గుహలోకి ఎంట్రీ మార్గంలా ఉండటం ఆసక్తిని రేపుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలను నాసా శాస్త్రవేత్తలు అంతర్జాలంలో విడుదల చేశారు. బహుశా ఇది ఒక నాగరికతకు చిహ్నం అయి ఉండొచ్చని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఫోటోను.. మే 7వ తేదీన షార్ప్ పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో క్యూరియాసిటీ రోవర్ దీనిని గుర్తించినట్లు నాసా సైంటిస్టులు వెల్లడించారు. ఇది చూడటానికి భూమిపై నిర్మించని బంకర్ల ప్రవేశ మార్గంలాగే ఉంది. ఇది రహస్య గ్రహాంతర సమావేశాల కోసం నిర్మించిన బంకర్‌లా కనిపిస్తుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, అది వాస్తవం కాదని సైంటిస్టులు తేల్చారు.

మరి ఆ వింత ద్వారం ఏంటి? మార్స్ సైన్స్ లాబొరేటరీ శాస్త్రవేత్తల ప్రకారం.. దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ‘డోర్ వే’ ఒక రాయిలో పగుళ్ల వల్ల ఏర్పడిన ఖాళీ ప్రదేశం. ఇది పురాతన ఇసుక దిబ్బల వలన ఏర్పడిందట. ఈ దిబ్బలు శతాబ్ధాలుగా ఒకదానిపై ఒకటి పోగుబడి ఇలా ఏర్పడ్డాయని నాసా సైంటిస్టులు తెలిపారు. అది తలుపు గానీ, రహస్య ప్రవేశం గానీ కాదని స్పష్టం చేశారు. సాధారణంగా మార్టిన్ ఇసుక దిబ్బలలో పగుళ్లు నిలువుగా ఉంటాయట. ఇక్కడ కూడా రెండు నిలువు పగుళ్లు ఏర్పడటం ద్వారా అది ఒక ప్రవేశ మార్గం మాదిరిగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కాగా, క్యూరియాసిటీ రోవర్ తొలిసారిగా 2012లో అంగారకుడిపై అడుగు పెట్టగా.. అప్పటి నుంచి అంగారకుడిపై పరిశోధనలు కొనసాగిస్తూనే ఉంది. అంగారకుడిపై నిర్మానుష్యమైన ఇసుక దిబ్బలు, రాతి కొండల్లో తిరుగుతూ అణువణువును శోధిస్తుంది. ఇప్పటి వరకు ఇది 3,472 మార్టిన్ రోజులలో 27.84 కిలోమీటర్లు ప్రయాణించింది. వేలాది చిత్రాలను నాసా పరిశోధన కేంద్రానికి పంపుతోంది.