AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anekal Balraj: సినిమా పరిశ్రమను వెంటాడుతోన్న విషాదాలు.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత దుర్మరణం..

Anekal Balraj: ఆదివారం ఉదయం ఆయన రోడ్డు పక్కన కారు ఆపి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక బైక్ అతివేగంతో ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలరాజ్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి.

Anekal Balraj: సినిమా పరిశ్రమను వెంటాడుతోన్న విషాదాలు.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత దుర్మరణం..
Anekal Balraj
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: May 16, 2022 | 6:58 PM

Share

Anekal Balraj: సినిమా చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కేరళ మోడల్‌ షహానా, ఆట రియాలిటీ డ్యాన్స్‌ షో సీజన్-1 విన్నర్‌ టీనా సాధు , బెంగాలీ సీరియల్స్‌ నటి పల్లవిడే అనుమానాస్పదంగా మరణించారు. తమ అభిమానులను విషాదంలో ముంచారు. తాజాగా అలాంటి విషాదమే మరొకటి చోటుచేసుకొంది. ప్రముఖ కన్నడ నిర్మాత అనేకల్‌ బాలరాజ్‌ (Anekal Balraj) దుర్మరణం పాలయ్యారు. బెంగళూరు జేపీ నగరలో నివాసముంటున్న ఆయన మార్కింగ్ వాక్ కు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఆదివారం ఉదయం ఆయన రోడ్డు పక్కన కారు ఆపి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక బైక్ అతివేగంతో ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలరాజ్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిన్నటి నుంచి చికిత్స తీసుకుంటున్న బాలరాజ్ సోమవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

కాగా బాలరాజు వయసు 58 ఏళ్లు. ఆయన కన్నడలో పలు హిట్‌ చిత్రాలను నిర్మించారు. 2003లో దర్శన్ కమర్షియల్‌ హిట్‌గా నిలిచిన చిత్రం కరియాను నిర్మించింది ఆయనే. అదేవిధంగా గణప లాంటి హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు. మొత్తం ఆరు చిత్రాలకు బాలరాజు నిర్మాతగా వ్యవహరించాడు. కాగా తన కుమారుడు సంతోష్‌ బాలరాజ్‌ను కూడా హీరోగా వెండితెరకు పరిచయం చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

Viral Photo: సర్కారు వారి పాట సినిమా చూసేందుకు సీక్రెట్‌గా థియేటర్‌కు వెళ్లిన ఈ స్టార్‌ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Railway News: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. ఆ మార్గాల్లో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.. పూర్తి వివరాలివే..

D Imman: రెండో పెళ్లి చేసుకున్న స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..