777 Charlie Trailer: ఆకట్టుకుంటున్న 777 ఛార్లి ట్రైలర్.. కుక్కతో మనిషి ఎమోషనల్ బాండింగ్..

ధర్మ లోకం వేరు ..నా వరకు నేను కరెక్ట్ అనుకునే వ్యక్తిత్వం తనది. చూసే వాళ్ల దృష్టిలో త‌ను త‌ప్పుగా క‌నిపిస్తుంటాడు. ఇల్లు, ఫ్యాక్ట‌రీ, గొడ‌వ‌, ఇడ్లీ, సిగ‌రెట్‌, బీర్ ఇదే త‌న ప్ర‌పంచం.

777 Charlie Trailer: ఆకట్టుకుంటున్న 777 ఛార్లి ట్రైలర్.. కుక్కతో మనిషి ఎమోషనల్ బాండింగ్..
777 Charlie
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: May 16, 2022 | 6:57 PM

కన్నడ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం 777 ఛార్లీ.. కిరిక్ పార్టీ సినిమాతో సూపర్ హిట్ సాధించిన రక్షిత్.. ఇప్పుడు డైరెక్టర్ కిర‌ణ్ రాజ్‌.కె ద‌ర్శకత్వంలో 777 ఛార్లీ అంటూ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా సమర్పిస్తున్నాడు. తెలుగుతోపాటు.. కన్నడ, మలయాళం, కన్నడ, తమిళ్ భాషల్లో ఈమూవీ జూన్ 10న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‏ను వెంకటేష్, సాయి పల్లవి, మంచు లక్ష్మి విడుదల చేశారు.

ధర్మ లోకం వేరు ..నా వరకు నేను కరెక్ట్ అనుకునే వ్యక్తిత్వం తనది. చూసే వాళ్ల దృష్టిలో త‌ను త‌ప్పుగా క‌నిపిస్తుంటాడు. ఇల్లు, ఫ్యాక్ట‌రీ, గొడ‌వ‌, ఇడ్లీ, సిగ‌రెట్‌, బీర్ ఇదే త‌న ప్ర‌పంచం. త‌న జీవితంలో ఇంట్రెస్టింగ్‌గా ఏదీ లేద‌ని అనుకునే ధ‌ర్మ జీవితంలో ఛార్లి అనే కుక్క ఎంట్రీ ఇస్తుంది. ముందు ధ‌ర్మ‌కి ఛార్లి అంటే అస్స‌లు ప‌డ‌దు. దాన్ని ఎవ‌రికైనా ఇచ్చేయాల‌ని అనుకుంటూ ఉంటాడు. అలాంటి ధ‌ర్మ‌కి ఓసారి ఆప‌ద‌లో చిక్కుంటాడు. అప్పుడు ఛార్లి అత‌న్ని బ‌తికిస్తాడు. అప్పుడు ఛార్లి త‌న‌పై చూపించే ప్రేమ‌కు ధ‌ర్మ మ‌న‌సు క‌రిగిపోతుంది. ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం పెరుగుతుంది. అలాంటి ఛార్లి, ధ‌ర్మ ఎందుకు కాశ్మీర్‌కి వెళ‌తారు. ఛార్లిని వెతుక్కుంటూ వెళ్లిన ధ‌ర్మ‌కు అక్క‌డ ఎదురైన ప‌రిస్థితులు ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే జూన్ 10న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న ‘777 ఛార్లి’ సినిమా చూడాల్సిందేనని అంటున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను జి.ఎస్‌.గుప్తాతో క‌లిసి త‌న ప‌ర‌మ్ వ‌హ్ బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మించారు. సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి సమర్పకుడిగా ఛార్లి 777 చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.