నితిన్ ‘భీష్మ’కు షాకింగ్ టీఆర్పీ రేటింగ్స్‌

నితిన్, రష్మిక హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం భీష్మ. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

  • Tv9 Telugu
  • Publish Date - 9:50 am, Fri, 6 November 20
నితిన్ 'భీష్మ'కు షాకింగ్ టీఆర్పీ రేటింగ్స్‌

Nithiin Bheeshma TRP ratings: నితిన్, రష్మిక హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం భీష్మ. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ సమయంలో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం, భీష్మకు ముందు వచ్చిన మూవీలు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో నితిన్ మూవీకి మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. ఇదే ఊపులో బుల్లితెర టీఆర్పీలోనూ ఈ సినిమా సత్తా చాటుతుందని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. ( జీవిత ఖైదు మహిళల విషయంలో.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం)

దసరా సందర్భంగా గత నెల ఈ మూవీ ప్రీమియర్ టెలివిజన్‌లో ప్రదర్శితమైంది. పండుగ సమయం అయినప్పటికీ.. భీష్మకు 6.65 రేటింగ్ వచ్చింది. టెలివిజన్‌లో ప్రదర్శితం అవ్వడానికంటే ముందు ఓటీటీలో వచ్చేయడంతో ఈ మూవీకి ‘లో’ రేటింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ ‘లో’ టీఆర్పీ రేటింగ్ మాత్రం భీష్మ టీమ్‌కి గట్టి షాక్‌ లాంటిదే. ( అంబులెన్స్‌కి దారి క్లియర్ చేసేందుకు 2కి.మీలు పరిగెత్తిన పోలీస్‌.. వీడియో వైరల్‌