అంబులెన్స్‌కి దారి క్లియర్ చేసేందుకు 2కి.మీలు పరిగెత్తిన పోలీస్‌.. వీడియో వైరల్‌

పోలీసులు ప్రజల భద్రతకు భరోసాను ఇస్తుంటారు. అవసరమైతే సాయం చేసేందుకు ఏ మాత్రం వెనుకాడరు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం పట్టించుకోరు.

అంబులెన్స్‌కి దారి క్లియర్ చేసేందుకు 2కి.మీలు పరిగెత్తిన పోలీస్‌.. వీడియో వైరల్‌
Follow us

| Edited By:

Updated on: Nov 06, 2020 | 10:23 AM

Hyderabad Cop Ambulance: పోలీసులు ప్రజల భద్రతకు భరోసాను ఇస్తుంటారు. అవసరమైతే సాయం చేసేందుకు ఏ మాత్రం వెనుకాడరు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం పట్టించుకోరు. అందుకే పోలీసులు లేని సమాజాన్ని ఎవ్వరూ ఊహించుకోలేరు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో ఓ పోలీసు చేసిన చర్య ఇప్పుడు వైరల్‌గా మారగా.. సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మీరు గ్రేట్ అంటూ అభినందనలు చెబుతున్నారు. ( Bigg Boss 4: ఆ సాయానికి చాలా గర్వంగా అనిపించింది)

వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం 6-7 గంటల సమయంలో హైదరాబాద్‌లోని అబిడ్స్‌-కోఠి మధ్యలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. ఆ సమయంలో వాహనాలన్నీ రోడ్డుపై క్యూ కట్టి ఉన్నాయి. ఆ వరుసలో రోగితో ఉన్న అంబులెన్స్ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. కానీ వాహనాలన్నీ వరుసగా ఉండటంతో అంబులెన్స్‌ డ్రైవర్‌కి కష్టంగా మారింది. దీన్ని గమనించిన బాబ్జీ అనే కానిస్టేబుల్‌.. ఆ అంబులెన్స్‌కి దారి క్లియర్ చేసే బాధ్యతలు తీసుకున్నారు. అలా దాదాపు 2కి.మీలు బాబ్జీ పరుగెత్తారు. దానికి సంబంధించిన వీడియోను అంబులెన్స్‌లో ఉన్న ఓ వ్యక్తి తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారగా.. బాబ్జీపై ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాదు అంబులెన్స్‌కి దారి ఇప్పించేందుకు బాబ్జీ చేస్తున్న చర్యపై అక్కడున్న వారందరూ క్లాప్స్ కొట్టారు. ( Bigg Boss 4: సీక్రెట్‌ పెళ్లి చేసుకున్నా.. మొదటి బిడ్డను చంపేసుకున్నా)

ఇక దీనిపై మాట్లాడిన బాబ్జీ.. ”అంబులెన్స్ ట్రాఫిక్‌లో స్టక్‌ అయిన విషయాన్ని గమనించి, ఏదైనా చేయాలనుకున్నా. అంబులెన్స్‌కి దారి ఇవ్వాలని వాహనాదారులను కోరుతూ ముందుకు సాగా. చాలా మంది నన్ను అభినందించారు. నాకు చాలా తృప్తిగా అనిపించింది” అని తెలిపారు. ( Bigg Boss 4: సీక్రెట్ టాస్క్‌లో గెలిచిన హారిక.. కెప్టెన్సీ రేస్‌లో ఆ ముగ్గురు)

బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్