Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మిథున రాశి వారు ఇంట్లో శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశులు వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 26 April 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 26, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మిథున రాశి వారు ఇంట్లో శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశులు వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి తగ్గుతుంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కుటుంబ పరిస్థితుల అనుకూలంగా ఉంటాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త ఉద్యోగానికి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యో గంలో వివాదాలు సర్దుమణగడం, సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొత్త వాహనం కొనడానికి అవకాశముంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగి పోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆదాయ మార్గాలు సత్ఫలితా లని స్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇంట్లో శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు, ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుంచి ఆశిం చిన శుభ వార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్నిమార్పులు, చేర్పులు చేసి, లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబానికి సంబంధించి అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుం టుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలను రాజీ మార్గంలో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగులకు పని భారం ఎక్కువగా ఉంటుంది. వృత్తి జీవితంలో ఒత్తిడి బాగా పెరుగుతుంది. చివరి క్షణంలో ప్రయా ణాలు వాయిదా పడతాయి. పిల్లలు చదువుల్లో మరింతగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఆర్థిక విషయాల్లో ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

చేపట్టిన వ్యవహారాలు నిరాటంకంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాదిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో సునాయాసంగా లాభాలు గడిస్తారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగులకు సానుకూలంగా సాగిపోతుంది. బాధ్యతల నిర్వహణలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

పిల్లల విజయాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు ఒకటి రెండు ఆశించిన శుభవార్తలు అందుతాయి. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడి పండుగ వాతావరణం నెలకొంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆరోగ్యం విషయంలోనూ, ప్రయాణాల విషయంలోనూ కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రులతో సఖ్యత మరింతగా పెరుగుతుంది. అనుకున్న సమయానికి అనుకున్న పను లన్నీ పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది కానీ, అనవసర ఖర్చులు కూడా పెరిగే అవ కాశం ఉంది. వ్యాపారులకు కొన్ని లాభావకాశాలు అంది వస్తాయి. ఉద్యోగం విషయంలో ఉన్నతా ధికారులతో వివాదాలు, విభేదాలు తొలగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

వృశ్చికం (విశాఖ, అనూరాధ, జ్యేష్ట)

ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవు తారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగుల ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్తగా వాహనం కొనే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది కానీ, తొందరపడి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. స్వల్ప అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

దాయాదులతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సా హంగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా ఊహించని అనుకూలతలు ఎదురవుతాయి. చేపట్టిన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా సాగి పోతుంది. కుటుంబ బాధ్యతల నిర్వహణలో సత్ఫలితాలను పొందుతారు. ఆర్థిక విషయాల్లో అప్ర మత్తంగా వ్యవహరించాలి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ముఖ్యమైన విషయాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆస్తి వివాదంలో రాజీ మార్గాన్ని అనుసరిస్తారు. చేపట్టిన ప్రతి పనీ విజయవంతంగా పూర్తవుతుంది. వృత్తి, వ్యాపారాలు గతం కంటే బాగా పుంజుకుంటాయి. ఉద్యోగులు సహోద్యోగుల సహాయంతో సమర్థవంతంగా బాధ్యతలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

అనుకున్న పనుల్ని వేగంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపా రాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచ యాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కుటుంబ సభ్యుల కారణంగా కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలా వరకు బయటపడతారు. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశముంది. ప్రయాణాలు ఆఖరి నిమిషంలో వాయిదా పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఉంటుంది. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

Latest Articles