చైనాలో ధాన్యం పండించినట్లే పాములను పెంచుతారు.. ఎందుకంటే 

15 March 2024

TV9 Telugu

Pic credit - Pexels

చైనా ఆహారపు అలవాట్లు గురించి రకరకాల ఫన్నీ కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. వింత ఆహారం గురించి చెప్పాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది డ్రాగన్ కంట్రీనే 

అగ్రస్థానంలో చైనా

చైనీయులు పాకేవీ, ఈదేవీ, ఎగిరే జీవులు అంటే బొద్దింకలు, కప్పలు, పాములు ఇలా అన్ని రకాల జీవులను లొట్టలేసుకుని తింటారు. అయితే లక్షల్లో పాములను ఓ గ్రామం పెంచుతోంది. 

పాముల పెంపకం

జిసికియావో గ్రామంలో తాచు పాములు, నాగ పాము, కట్ల పాము, పసిరి పాము వంటి విషపూరిత పాములు సాగు చేస్తున్నారు. 

 విషపూరితమైన పాములు 

వాస్తవానికి  వేలాది సంవత్సరాలుగా చైనీయులు సాంప్రదాయ వైద్యంలో పాము విషం సహాయంతో ఔషధం తయారు చేయవచ్చని నమ్ముతారు.

ఔషధం కోసం విషం 

పాము నుండి తయారుచేసిన ఔషధాన్ని ఆల్కహాల్ తాగే ముందు తీసుకుంటే.. ఆ ఆల్కహాల్ కాలేయంపై ప్రభావం చూపదట. ఎంత తాగినా ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు.

మనిషి ఆరోగ్యం

జిసికియావో గ్రామం చైనాకు ముఖ్యమైనది. ఎందుకంటే పాములతో తయారు చేసి అన్ని ఔషధాలు ఈ గ్రామంలోనే తయారవుతాయి.

చైనాకు ముఖ్యమైన గ్రామం 

1980 నుంచి ఈ గ్రామంలో పాముల పెంపకం మొదలు పెట్టారు. చైనాలో దాదాపు 90 శాతం పాముల అవసరాలను తీర్చేది ఈ గ్రామమే.. కనుక ఈ గ్రామాన్ని పాముల గ్రామం అంటారు. 

 పాము గ్రామంగా ప్రసిద్ధి