AP Inter supply 2024 Exams: ఏపీ ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్.. ఏయే తేదీల్లో ఏయే పరీక్షలు ఉంటాయంటే..
ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌లో వెల్లడించింది. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి షిఫ్టులో ఇంరట్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. రెండో షిఫ్టులో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల..
అమరావతి, ఏప్రిల్ 26: ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌లో వెల్లడించింది. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి షిఫ్టులో ఇంరట్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. రెండో షిఫ్టులో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి. జూన్ 6వ తేదీన నైతికత, మానవ విలువల పరీక్ష, జూన్ 7వ తేదీన పర్యావరణ విద్య పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతాయి.
ఇక ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల విషయానికొస్తే.. మే 1 నుంచి 4 వరకు జరుగుతాయి. ఇవి కూడా రెండు విడతలుగా ఉంటాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్టు పరీక్షలు జరుగుతాయి.
ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్ ఇదే..
మే 24వ తేదీన ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్-1, 2 మే 25వ తేదీన ఇంగ్లిష్ పేపర్-1, 2 మే 27వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్-1ఏ, 2ఏ, బయాలజీ పేపర్-1, 2, సివిక్స్ పేపర్-1, 2 మే 28వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్-1బీ, 2బీ, జువాలజీ పేపర్-1, 2 మే 29వ తేదీన హిస్టరీ పేపర్-1, 2, ఫిజిక్స్ పేపర్-1, 2, ఎకనామిక్స్ పేపర్-1, 2 మే 30వ తేదీన కెమిస్ట్రీ పేపర్-1, 2, కామర్స్ పేపర్-1, 2, సోషియాలజీ పేపర్-1, 2, ఫైన్‌ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1, 2 మే 31వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, 2, లాజిక్ పేపర్-1, 2, బ్రిడ్జికోర్సు గణితం పేపర్-1, 2 జూన్ 1వ తేదీన మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, 2, జాగ్రఫీ పేపర్-1, 2
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.