Viral: చెరువు దగ్గర మట్టిలో వింత ఆకారం.. తవ్వి చూడగా దిమ్మతిరిగింది..
చెదల పట్టిన ఫైల్స్‌ను దులిపి.. ఓ ఏడేళ్ల నాటి హత్య కేసును సాల్వ్ చేశారు పోర్ బందర్ జిల్లాలోని రణ్‌వావ్ పోలీసులు. తవ్వి చూడగా పోలీసులు దిమ్మతిరిగింది.. ఆ మట్టిలో ఓ వింత ఆకారం కనిపించింది. అదేంటో తెలుసుకుందామా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
చెదల పట్టిన ఫైల్స్‌ను దులిపి.. ఓ ఏడేళ్ల నాటి హత్య కేసును సాల్వ్ చేశారు పోర్ బందర్ జిల్లాలోని రణ్‌వావ్ పోలీసులు. మంగళవారం 2017లో హత్యకు గురైన పర్బత్ అలియాస్ గాగు కొడియాటర్ అనే వ్యక్తి అస్థిపంజర అవశేషాలను వర్వల గ్రామంలోని చెరువు ఒడ్డున ఐదు గంటలపాటు తవ్వకాలు జరిపి బయటకు తీశారు. సుమారు 100 ముక్కల అస్థిపంజరాల అవశేషాలు బయటపడ్డాయి. సబ్ ఇన్‌స్పెక్టర్ జడేజాకు అందిన సమాచారం మేరకు పోలీసులు కొన్ని రోజుల క్రితం భిఖా సెజా ఉల్వా అనే 60 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు డిసెంబర్ 2017లో 38 సంవత్సరాల వయస్సు గల కొడియాటర్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు. అతడి మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని కూడా పోలీసులకు చెప్పాడు. అనంతరం జునాగఢ్ ఫోరెన్సిక్ అధికారుల సమక్షంలో ఆస్థిపంజరం అవశేషాలను వెలికితీశారు పోలీసులు.
‘ప్రాథమిక దర్యాప్తులో కొడియాటార్‌ను గొంతు కోసి చంపినట్లు నిందితుడు చెప్పాడు. అలాగే మృతదేహాన్ని గ్రామ శివారులోని చెరువు ఒడ్డున పాతిపెట్టాడు. కొడియాతర్ భార్య, నిందితుడికి మధ్య వివాహేతర సంబంధం ఉందని తేలింది. ఒక రోజు కొడియాటర్.. తన భార్యను ఉల్వాతో కలిసి ఉండటాన్ని చూశాడు. అది భార్యభర్తల ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. అలా కొడియాటర్ హత్యకు ప్రణాళిక రచించడానికి కారణమైంది. మృతుడి దినచర్యను పరిశీలిస్తూ.. పక్కాగా స్కెచ్ వేసి.. హత్య చేశాడు ఉల్వా. 2017 డిసెంబర్ 25వ తేదీ రాత్రి పాలు విక్రయించేందుకు వెళ్లిన కొడియాటర్ ఎంతకూ తిరిగి రాకపోవడంతో.. అతడి కుటుంబ సభ్యులు రణవావ్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. మిస్సింగ్ కేసు రిపోర్ట్ చేశారు’ అని పోర్‌బందర్‌లోని పోలీసు సూపరింటెండెంట్ భగీరథ్‌సింగ్ జడేజా చెప్పారు.