- Telugu News Photo Gallery Cinema photos Rakul Preet Singh latest stunning pictures goes viral in internet
Rakul Preet Singh: అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
రకుల్ ప్రీత్ సింగ్ ప్రధానంగా హిందీ, తెలుగు మరియు తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌లో నాలుగు నామినేషన్లతో పాటు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్‌తో సహా అనేక అవార్డులను గెలుచుకుంది. కెరటం, తడయ్యర తాక్క, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రాలతో తెలుగు, తమిళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ వయ్యారి భామ. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
Updated on: Apr 25, 2024 | 10:14 PM

రకుల్ ప్రీత్ సింగ్ న్యూ ఢిల్లీలోని పంజాబీ సిక్కు కుటుంబంలో 10 అక్టోబర్ 1990న జన్మించింది. రకుల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్, ధౌలా కువాన్ నుండి పాఠశాల విద్యను అభ్యసించింది. తర్వాత జీసస్ అండ్ మేరీ కాలేజీలో గణితశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది.

ఆమె తండ్రి ఆర్మీ అధికారి. ఆమె తల్లి రాజేందర్ కౌర్ మరియు తండ్రి కుల్విందర్ సింగ్. ఆమె తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్, రామ్ రాజ్య చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు.

18 ఏళ్ల వయస్సులో కళాశాలలో చదువుతున్నప్పుడే మోడలింగ్‌లో తన కెరీర్ ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. 2009లో సెల్వరాఘవన్ యొక్క 7G రెయిన్‌బో కాలనీకి రీమేక్ అయిన గిల్లి అనే కన్నడ చిత్రంలో ఆమె తొలిసారిగా నటించింది. ఆ సినిమాలో తన పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది

2011లో కెరటం సినిమాతో తెలుగు తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది. తర్వాత 2013లో వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ సినిమలో కథానాయకిగా నటించింది. 2014లో లౌక్యం సినిమాలో హీరోయిన్ గా విజయాన్ని అందుకుంది.

తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. దాదాపు తెలుగులో అందరు స్టార్ హీరోల పక్కన కనిపించింది. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా ఆకట్టుకుంది ఈ వయ్యారి.





























