AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Jugaad : చెరుకు రసంతో కల్తీ లేని కమ్మటి బెల్లం..! ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

అలాంటి బెల్లం ఇంట్లోనే తయారు చేసుకుంటే మరింత స్వచ్ఛతతో, మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇప్పుడు మీరు బెల్లం ఎలా తయారు చేయాలి అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఇంట్లో చెరకు రసం నుండి బెల్లం ఎలా తయారు చేయాలో చెప్పబడింది. అవును, ఈ రోజు మనం ఇంట్లోనే కల్తీలేని బెల్లం ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Kitchen Jugaad : చెరుకు రసంతో కల్తీ లేని కమ్మటి బెల్లం..! ఇంట్లోనే తయారు చేసుకోండిలా..
Natural Jaggery From Sugar
Jyothi Gadda
|

Updated on: Apr 25, 2024 | 8:33 PM

Share

బెల్లం కొనాలంటే నేరుగా మార్కెట్‌కి వెళ్లి వచ్చిన ధరకే కొంటాం. నిజానికి బెల్లం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం సహజ చక్కెరను కలిగి ఉంటుంది. బెల్లం అనేక ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. గొంతునొప్పి అయినా, అసిడిటీ అయినా గ్యాస్ సమస్య బెల్లంతో మాయం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి బెల్లం ఇంట్లోనే తయారు చేసుకుంటే మరింత స్వచ్ఛతతో, మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇప్పుడు మీరు బెల్లం ఎలా తయారు చేయాలి అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఇంట్లో చెరకు రసం నుండి బెల్లం ఎలా తయారు చేయాలో చెప్పబడింది. అవును, ఈ రోజు మనం ఇంట్లోనే కల్తీలేని బెల్లం ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతోంది. ఎక్కడ చూసినా చెరుకు రసం అమ్మే బండ్లు కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు బయటి నుంచి ఒక లీటరు చెరుకు రసం తెచ్చి ఇంట్లో చెరుకు రసంతో బెల్లం తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం ఒక లీటరు చెరకు రసం తీసుకోండి. అప్పుడు పెద్ద మందపాటి ఇనుము లేదంటే, స్టీల్ పాన్ తీసుకోండి. దానికి చెరుకు రసం వేసి తక్కువ మీడియం మంట మీద చెరుకు రసాన్ని మరిగించాలి. ఈ రసం బాగా ఉడికిన తరువాత, చెరకు రసంపై నురుగు వస్తుంది. చెక్క చెంచాతో చెరకు రసాన్ని అడుగంటకుండా కలుపుతూనే ఉండండి. అలా 35 నుండి 40 నిమిషాలలో ఆ చెరుకు రసం నుండి బెల్లం సిద్ధంగా ఉంటుంది. ఒక సిలికాన్ సాష్ తీసుకుని అందులో ఈ బెల్లం వేయండి. రెండు గంటల తరువాత, కల్తీ లేని, సహజ బెల్లం ఇంట్లోనే తయారవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో Instagram ఖాతా prajakta_salve_marathi నుండి షేర్‌ చేయబడింది. ఈ వీడియో క్యాప్షన్‌లో ఇలా రాసి ఉంది.. “ఇంట్లో బెల్లం తయారు చేయండి.. ఇది తాజాగా ఉంటుంది. ఈ వీడియోని మరోమారు జాగ్రత్తగా గమనించండి.. దాంతో మీరు ఈ సులభమైన పద్ధతిలో ఇంట్లోనే బెల్లం తయారు చేసుకోవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్