వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బండిపడుతున్నారా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ట్రై చేయండి..!

మీరు కూడా వేసవిలో పెదవులు పగిలిన సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. పగిలిన పెదవులపై కొబ్బరి నూనెను రాయండి. ఒకటి లేదా రెండు రోజుల్లో మీరు ఫలితాలను గమనిస్తారు. కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇది పెదాలను మృదువుగా, హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బండిపడుతున్నారా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ట్రై చేయండి..!
Chapped Lips In Summer
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 25, 2024 | 8:35 PM

చలికాలంలో దాదాపుగా ప్రతి ఒక్కరికీ చర్మం పొడిబారిపోయి పెదాలు పగిలిపోతుంటాయి. కానీ, వేసవిలో పెదవులు పగిలిపోతే దానికి కారణం ఏంటో తెలుసా..? వేసవిలో వాతావరణంలో తేమ శాతం చాలా వరకు తగ్గుతుంది. తేమ కోల్పోవడం వల్ల, పెదవులు పొడిబారడం మొదలవుతుంది. మీరు కూడా వేసవిలో పెదవులు పగిలిన సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. పగిలిన పెదవులపై కొబ్బరి నూనెను రాయండి. ఒకటి లేదా రెండు రోజుల్లో మీరు ఫలితాలను గమనిస్తారు. కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇది పెదాలను మృదువుగా, హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

పగిలిన పెదవులకు కొబ్బరి నూనె..

ఇందుకోసం ముందుగా మీరు మీ పెదాలను గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. పెదాలు ఆరిన తర్వాత చేతులతో కొబ్బరి నూనెను తీసుకుని పెదాలపై సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రంతా మీ పెదవులపై కొబ్బరి నూనెను అలాగే రాసి వదిలేయండి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేయండి. రెండు రోజుల్లో మీరు చక్కటి ఫలితాలను చూస్తారు.

ఇవి కూడా చదవండి

పగిలిన పెదాలకు కలబంద

కలబంద చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. పగిలిన పెదాలను మృదువుగా చేయడానికి ఇది మంచి ఎంపిక. మీరు రాత్రి పడుకునే ముందు మీ పెదవులపై కలబంద జెల్‌ను అప్లై చేసి, మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత కడిగేయవచ్చు. కొద్ది రోజుల్లోనే పగిలిన పెదాల నుంచి ఉపశమనం పొందుతారు.

ఈ రెండు విధనాలు కాకుండా..మీరు కొన్ని హోం రెమిడీస్‌ని కూడా ప్రయత్నించవచ్చు. మీరు కూడా పెదవులు పగిలిన సమస్యతో బాధపడుతుంటే వాటిపై తేనెను రాసుకోవచ్చు. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయని చెబుతున్నారు. దీన్ని అప్లై చేయడం వల్ల మీ పెదాలు మృదువుగా ఉంటాయి. కావాలంటే దానితో లిప్ బామ్ కూడా తయారు చేసుకోవచ్చు.

పాలు

మీరు కూడా పగిలిన పెదవులతో బాధపడుతూ ఉంటే..పాలు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పాలు పగిలిన పెదవుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. దీనికి పాలను పెదవులపై అప్లై చేయడం మేలు చేస్తుంది.

పసుపు- పాలు

పసుపు అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. పగిలిన పెదవులకు పరిష్కారంగా కూడా పసుపు పనిచేస్తుంది. పసుపులో కొన్నిచుక్కల పాలు పోసి చిక్కటి మందపాటి పేస్ట్ తయారు చేయండి. దీన్ని పెదవులపై రాసి కొద్దిసేపటి తర్వాత పెదాలను కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మార్పును మీరే చూస్తారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!