- Telugu News Photo Gallery Innovative Ways To Incorporate Superfoods Into Your Daily Diet Telugu Lifestyle News
Super food: ఆహారంలో సూపర్ ఫుడ్స్ తీసుకోండి ఇలా.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది
ఆరోగ్యవంతమైన జీవనం కోసం మంచి పోషకాహారం తప్పనిసరి. సాధారణ ఆహారంతో పాటు అత్యవసరమైన పోషకాలు ఉండే సూపర్ ఫుడ్స్‌ని తప్పక తీసుకోవాలి. అలాంటి ఆహారాలతో మన శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మనం రోజూ తినే సాధారణ ఆహారంలో వీటిని కూడా చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలికంగా అత్యుత్తమ ఫలితాలు అందుతాయని వివరిస్తున్నారు. అలాంటి సూపర్ ఫుడ్స్ ఏంటి..? వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Apr 25, 2024 | 7:12 PM

Seeds As Garnish- చియాసీడ్స్, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, డ్రైఫ్రూట్స్ లో భాగంగా ఉండే ఇతర విత్తనాలు, గింజలను సూపర్ ఫుడ్స్‌లో భాగమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, జింక్, మెగ్నీషియం, రాగి, విటమిన్లు వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఇలాంటి నట్స్‌ని క్రమం తప్పకుండా తింటూ ఉంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం మీరు వీటిని వివిధ వంటకాలు, ఆహార పదార్థాలు, చిరుతిళ్లపై చల్లుకుని కూడా తినవచ్చునని సూచిస్తున్నారు.

డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. డార్క్ చాక్లెట్‌లోని కోకోలో ఫ్లేవనాయిడ్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. యవ్వనంగా కనిపించడంలో డార్క్ చాక్లెట్ ద్వారా అద్భుతాలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక అధ్యయనం మేరకు.. కోకో బీన్స్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్‌ని ఉన్నాయని చెబుతున్నారు. కోకో ముడుతలను తగ్గించడంలో సహాయ పడుతుంది. యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

Cauliflower Rice- కాలిఫ్లవర్ లో ప్రోటీన్లు, విటమిన్లు, జింక్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు నిండివున్నాయి. ఈ అన్నాన్ని తరచూ తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం సొంతమవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ తో అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కాలిఫ్లవర్ ను కొద్ది నిమిషాల పాటు ఉడకబెట్టి చల్లారాక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పులిహోర కోసం కలిపినట్టుగా కలిపి కాలీఫ్లవర్ రైస్ తయారు చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకుని తింటే బాగుంటుందని వివరిస్తున్నారు.

Nuts As Snacks- డ్రై ఫ్రూట్ నట్స్ ను ఉదయం, సాయంత్రం స్నాక్స్ గా తీసుకుంటే ఎంతో ప్రయోజనం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిలో అనేక రకాల పోషకాలతోపాటు ఒమేగా –3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా మాంసాహారానికి దూరంగా ఉండేవారికి ఇవి ఎంతో ప్రయోజనకరమని చెప్పారు. ఏదైనా పనిలో ఉన్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు జంక్ ఫుడ్ కు బదులుగా వీటిని పెట్టుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్లమవుతామని అంటున్నారు.

Yogurt Desserts- అటు శరీరానికి అవసరమైన పోషకాలతోపాటు ఇటు జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరించే లక్షణాలు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి. పెరుగుతో చాలా రకాల వంటకాలు తయారు చేసుకుని తింటుంటారు. పెరుగు ఉపయోగించి స్వీట్స్ కూడా తయారు చేస్తారు. అలాగే వెజ్, నాన్ వెజ్ వంటకాలలో కూడా పెరుగును వాడుతుంటారు. పెరుగు అన్నం, మజ్జిగా ఎలాగైనా సరే.. నిత్యం పెరుగును ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.




