UAE Rain : వరదలతో బురదమయంగా మారిన దుబాయ్‌.. తిరిగి మెరవాలంటే ఎన్ని కోట్లు కావాలి..?

కుండపోత వర్షం దుబాయ్‌ని పూర్తిగా నాశనం చేసింది. రోడ్లు, చౌరస్తాలు, ఇళ్లు, దుకాణాలు, విమానాశ్రయాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు నలుగురు చనిపోయారు. యుఎఇకి ముందు, ఏప్రిల్ 14 న ఒమన్‌ను తుఫాను తాకింది. అక్కడ 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని తరువాత తుఫాను యుఎఇని తాకింది. ఇక్కడ ఊహించని రీతిలో భారీ వర్షం కురిసింది.

UAE Rain : వరదలతో బురదమయంగా మారిన దుబాయ్‌.. తిరిగి మెరవాలంటే ఎన్ని కోట్లు కావాలి..?
Uae Rain
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 25, 2024 | 6:30 PM

ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో గత 75 ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదైంది. UAEలోని అత్యంత అందమైన, అభివృద్ధి చెందిన నగరమైన దుబాయ్‌లో ఇప్పుడు ఎటూ చూసినా చుట్టూ వరద నీరే కనిపిస్తుంది. కుండపోతగా కురిసిన వర్షం దుబాయ్‌ అందాలను చిద్రం చేసింది. 259.5 మిమీటర్లుగా నమోదైన వర్షాపాతం కారణంగా జనజీవనం, ట్రాఫిక్, వ్యాపార వాణిజ్యాలు పూర్తిగా స్తంభించిపోయాయి. యూఏఈని తిరిగి పూర్వ స్థితికి తీసుకురావడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందో సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.

దేశవ్యాప్తంగా వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిష్కరించాలని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 24న ఎమిరాటీ కుటుంబాల ఇళ్లను బాగు చేసేందుకు 544 మిలియన్ డాలర్లు (రూ. 4,535 కోట్లు) యూఏఈ ప్రకటించింది.

ప్రధాని మహ్మద్ రషీద్ అల్-మక్తూమ్ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించి, వరదలను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వరదల వల్ల సంభవించిన నష్టాన్ని ఎదుర్కోవడానికి రెండు బిలియన్ దిర్హామ్‌లను కేబినెట్ ఆమోదించింది. ప్రతి అనుభవం నుంచి నేర్చుకునే దేశం మనదని యూఏఈ ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మార్గం కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

కుండపోత వర్షం దుబాయ్‌ని పూర్తిగా నాశనం చేసింది. రోడ్లు, చౌరస్తాలు, ఇళ్లు, దుకాణాలు, విమానాశ్రయాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు నలుగురు చనిపోయారు. యుఎఇకి ముందు, ఏప్రిల్ 14 న ఒమన్‌ను తుఫాను తాకింది. అక్కడ 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని తరువాత తుఫాను యుఎఇని తాకింది. ఇక్కడ ఊహించని రీతిలో భారీ వర్షం కురిసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..