వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

J Y Nagi Reddy

| Edited By: Srikar T

Updated on: Apr 25, 2024 | 7:09 PM

కజకిస్థాన్ లో తెలుగు విద్యార్థి మృతి చెందారు. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి ప్రాణాలు విడిచారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి కవిత దంపతుల కుమారుడు పవన్ తేజేశ్వర్ రెడ్డి కజకిస్తాన్‎లో ఎంబిబిఎస్ చదువుతున్నాడు. ఆదివారం కజకిస్తాన్‎లోని ఓ సరస్సులో సరదాగా ఈతకొట్టేందుకు స్నేహితులతో కలిసి వెళ్ళాడు. అయితే సరస్సులో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మునిగి పవన్ తేజేశ్వర్ రెడ్డి మృతి చెందాడు.

Published on: Apr 25, 2024 07:08 PM