Watch Video: తిరుపతిలో నామినేషన్ వేసిన చంద్రగిరి వైసీపీ అభ్యర్థి.. పాల్గొన్న ముఖ్య నేతలు..

తిరుపతి జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. మోహిత్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా చంద్రగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ రెడ్డప్ప, భూమన కరుణాకర్‌రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నామినేషన్‌ ర్యాలీకి వైసీపీ కార్యకర్తలు పెద్దయెత్తున తరలిరావడంతో చంద్రగిరి పట్టణం కిక్కిరిసిపోయింది.

Watch Video: తిరుపతిలో నామినేషన్ వేసిన చంద్రగిరి వైసీపీ అభ్యర్థి.. పాల్గొన్న ముఖ్య నేతలు..

|

Updated on: Apr 25, 2024 | 3:51 PM

తిరుపతి జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. మోహిత్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా చంద్రగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ రెడ్డప్ప, భూమన కరుణాకర్‌రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నామినేషన్‌ ర్యాలీకి వైసీపీ కార్యకర్తలు పెద్దయెత్తున తరలిరావడంతో చంద్రగిరి పట్టణం కిక్కిరిసిపోయింది.

జగన్‌ మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు మంత్రి రోజా. కుల, మత బేధాలు లేకుండా.. అన్ని వర్గాల ప్రజలకు జగన్‌ మేలు చేశారని తెలిపారు. అందుకే ప్రజలు జగన్ వెంట నడిచేందుకు సిద్దం అని బ్రహ్మరథం పడుతున్నారరన్నారు. సీఎం జగన్ రెండవసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు మంత్రి రోజా.

మండుటెండను కూడా లెక్కచేయకుండా నామినేషన్‌కు కార్యక్రమానికి తరలివచ్చిన చంద్రగిరి ప్రజలకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా, భవిష్యత్తులో మీ అందరిపై భయం, బాధ్యత ఉంచి పనిచేస్తానని, సేవ చేస్తానని హామీ ఇచ్చారు మోహిత్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు నగదు రూపంలో సుమారు రెండు లక్షలు రూపాయలు అందాయని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us
Latest Articles