తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం.. పెద్ద ఎత్తున పోటీ పడ్డ స్వతంత్య్ర అభ్యర్థులు..
ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రు కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. అనుచరులతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్లు వేశారు. ఇక రేపటినుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 29 వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు 3,300లకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. 25 పార్లమెంట్ స్థానాలకు 600మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడంతో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్రు కూడా పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. అనుచరులతో కలిసి ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్లు వేశారు. ఇక రేపటినుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 29 వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు 3,300లకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. 25 పార్లమెంట్ స్థానాలకు 600మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇటు తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 600ల మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దాఖలైన నామినేషన్లను రేపటినుంచి పరిశీలించనున్నారు. ఈసీ రూల్స్‌కి అనుగణంగా అభ్యర్థులు నామినేషన్లను పూర్తి చేశారా లేదా అన్నది క్లియర్‌గా పరిశీలించనున్నారు. ఒకవేళ తేడా వస్తే ఆ నామినేషన్‌ను తిరస్కరిస్తారు. మరోవైపు ఈనెల 29 వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. వచ్చే నెల 13న ఏపీలో అసెంబ్లీ, ఎంపీ.. తెలంగాణలో ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కూడా అదే రోజు జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

