AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soya Beans: సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్‌ పెడుతుంది..!

చర్మం మెరుపును సంతరించుకుంటుంది. సోయాబీన్‌ పానీయాల్లో ఐసోఫ్లేవోన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడతాయి. సోయాబీన్ జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతుంది. అలాగే, సోయాబీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. సోయాబీన్స్‌ యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్ మాదిరి పని చేస్తాయి. ఈస్ట్రోజన్‌ స్థాయిలను ఇది రెగ్యులేట్‌ చేస్తాయి.

Soya Beans: సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్‌ పెడుతుంది..!
Soya Beans
Jyothi Gadda
|

Updated on: Apr 25, 2024 | 4:00 PM

Share

బరువు తగ్గడానికి, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని చెబుతుంటారు. మాంసాహారం తినేవారు గుడ్లు, మాంసం ద్వారా ప్రోటీన్‌ను పొందగలుగుతారు. అయితే శాఖాహారులకు తగినంత ప్రోటీన్‌ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దాంతో పాటుగానే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ ఆహారంలో తగిన మొత్తంలో ప్రోటీన్‌ ఉండే ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం. అటువంటి అధిక ప్రోటీన్ ఆహారాలలో సోయాబీన్ కూడా ఒకటి. సోయాబీన్స్‌ అనేది బఠానీ కుటుంబానికి చెందినది. సోయాలో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా సోయాబీన్స్‌ తినడం వల్ల పలురకాల అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. అంతేకాదు..సోయాబీన్‌ను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సోయాబీన్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే ఇది మీ శరీరానికి సరైన ఎదుగుదలకు అవసరమైన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇదీ కాకుండా, సోయాబీన్స్ బరువు తగ్గడంలో మీకు సహాయపడే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. సోయాబీన్స్‌ను తీసుకోవడంతో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా సోయాబీన్స్‌ తినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. నిద్ర లేమి సమస్యలు దూరమవుతాయి. ఎముకలను బలంగా మార్చడంలో సోయా బీన్స్‌ సహాయపడతాయి. ముఖ్యంగా మహిళల్లో మోనోపాజ్‌ సమయంలో ఎముకలు బలహీనంగా మారుతాయి. ఈ టైంలో సోయా ఉత్పత్తులు తినడం మంచిది.

మనం తీసుకునే ఆహారంలో క్రమం తప్పకుండా సోయాబీన్స్‌ను చేర్చుకోవటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిజరాయిల్ స్థాయిలు చాలా వరకు తగ్గుతాయి. దీంతో రక్తప్రసరణలో ఇబ్బందులు ఏర్పడవు. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోయాబీన్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. సోయాను తీసుకోవడంతో కొల్లాజెన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మ ఎలాస్టిసిటీని పెంచుతుంది. దీంతో చర్మం ముడతలు తగ్గిపోతాయి. చర్మం మెరుపును సంతరించుకుంటుంది. సోయాబీన్‌ పానీయాల్లో ఐసోఫ్లేవోన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడతాయి. సోయాబీన్ జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతుంది. అలాగే, సోయాబీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. సోయాబీన్స్‌ యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్ మాదిరి పని చేస్తాయి. ఈస్ట్రోజన్‌ స్థాయిలను ఇది రెగ్యులేట్‌ చేస్తాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..