Diabetes: డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? బ్లడ్ షుగర్ అమాంతం పెరుగుతుందా..

మధుమేహ వ్యాధిగ్రస్తులు స్వీట్లు తినకూడదన్న విషయం అందరికీ తెలుసు.. ఎందుకంటే ఇవి చక్కెర స్థాయిని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో డయాబెటిస్‌లో చాలా పండ్లు తినడం కూడా నిషేధం.. ఎందుకంటే ఇందులో సహజ చక్కెర ఫ్రక్టోజ్ ఉంటుంది.. ఇది చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో, వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కొన్ని పండ్లు సహాయపడతాయి.

Diabetes: డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? బ్లడ్ షుగర్ అమాంతం పెరుగుతుందా..
Diabetes in Watermelon
Follow us

|

Updated on: Apr 25, 2024 | 3:50 PM

మధుమేహ వ్యాధిగ్రస్తులు స్వీట్లు తినకూడదన్న విషయం అందరికీ తెలుసు.. ఎందుకంటే ఇవి చక్కెర స్థాయిని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో డయాబెటిస్‌లో చాలా పండ్లు తినడం కూడా నిషేధం.. ఎందుకంటే ఇందులో సహజ చక్కెర ఫ్రక్టోజ్ ఉంటుంది.. ఇది చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో, వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కొన్ని పండ్లు సహాయపడతాయి. అలాంటి పండ్లలో పుచ్చకాయ ఒకటి.. ఇలాంటి పుచ్చకాయను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినాలా..? వద్దా..? అనే విషయంలో చాలా గందరగోళం నెలకొంటుంది. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా తీపిని కలిగి ఉంటుంది. అందుకే డయాబెటిస్‌లో సందేహం కలుగుతుంది. మీరు కూడా డయాబెటిక్ తో బాధపడుతుంటే.. పుచ్చకాయ తినడం మంచిదో కాదో తెలుసుకోవడం ముఖ్యం.. డయాబెటిస్‌లో పుచ్చకాయను తినడం వల్ల ప్రయోజనాలతోపాటు దుష్ప్రభావాలు కూడా ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

పుచ్చకాయలో ఎంత చక్కెర ఉంది..

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ డేటా ప్రకారం.. ఒక కప్పు లేదా 152 గ్రాములు కట్ చేసిన పుచ్చకాయలో 9.42 గ్రాముల సహజ చక్కెరలు, 11.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అదే సమయంలో, పుచ్చకాయ సాధారణంగా 72 GIని కలిగి ఉంటుంది. అయితే 120-గ్రాముల సర్వింగ్‌కు (గ్లైసెమిక్ ఇండెక్స్) GL 5 ఉంటుంది. అన్ని పండ్లలాగే పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, సమతుల్య ఆహారంలో భాగంగా తక్కువ పరిమాణంలో తినవచ్చు.

పుచ్చకాయ తింటే షుగర్ పెరుగుతుందా?

పుచ్చకాయ తినడం వల్ల డయాబెటిక్ పేషెంట్‌లో షుగర్ లెవల్స్ పెరుగుతాయా లేదా అనేది తినే పండు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఇది సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే, పుచ్చకాయ తినడం వల్ల చక్కెర స్థాయిపై ఎటువంటి ప్రతికూల ప్రభావం కనిపించదు.

డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

డయాబెటిక్ రోగులలో కార్డియో వాస్కులర్ డిసీజ్ సమస్య చాలా సాధారణం. అటువంటి పరిస్థితిలో నియంత్రిత పరిమాణంలో పుచ్చకాయ వినియోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి, పుచ్చకాయకు ఎరుపు రంగును ఇచ్చే మూలకం లైకోపీన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం లైకోపీన్ కార్డియో వాస్కులర్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గించడానికి పనిచేస్తుంది. అయితే, మితంగా తింటే పర్వాలేదు.. కానీ ఎక్కువగా తీసుకుంటే.. షుగర్ లెవల్స్ పెరిగే అవకాశముందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
హీట్ పెంచుతున్న నిజామాబాద్ పాలిటిక్స్.. పేలుతున్న మాటల తూటాలు
హీట్ పెంచుతున్న నిజామాబాద్ పాలిటిక్స్.. పేలుతున్న మాటల తూటాలు
వేసవిలో మల్బరీ పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే..ఇకపై
వేసవిలో మల్బరీ పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే..ఇకపై
భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతే ప్రత్యామ్నాయ యాప్స్‌ ఏంటంటే
భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతే ప్రత్యామ్నాయ యాప్స్‌ ఏంటంటే
ఐపీఎల్‌లో కొత్త చరిత్రను లిఖించిన రన్ మెషీన్.. తొలి ప్లేయర్‌గా..
ఐపీఎల్‌లో కొత్త చరిత్రను లిఖించిన రన్ మెషీన్.. తొలి ప్లేయర్‌గా..
మామిడి గింజలతో బోలేడు లాభాలు... అనేక సమస్యలకు దివ్యౌషధం!
మామిడి గింజలతో బోలేడు లాభాలు... అనేక సమస్యలకు దివ్యౌషధం!
ప్రేమలు హీరోయిన్ పేరు మమిత కదా.. ?
ప్రేమలు హీరోయిన్ పేరు మమిత కదా.. ?
కోహ్లీ ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తాడు.. ధర ఎంతో తెలుసా?
కోహ్లీ ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తాడు.. ధర ఎంతో తెలుసా?
గుండె జబ్బులున్న వారు ఈ 5 యోగాసనాలు వేయకూడదు..మరింత ప్రమాదం
గుండె జబ్బులున్న వారు ఈ 5 యోగాసనాలు వేయకూడదు..మరింత ప్రమాదం
పులివెందుల గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న వైఎస్‌ భారతి
పులివెందుల గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న వైఎస్‌ భారతి
రోడ్డుపై గుంతల నివారణకు నయా టెక్నీక్‌..! వాటికవే సొంతంగా మరమ్మతు
రోడ్డుపై గుంతల నివారణకు నయా టెక్నీక్‌..! వాటికవే సొంతంగా మరమ్మతు