AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Health Care: డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోనే!

డయాబెటిక్ రోగులు ఏడాది పొడవునా ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ఎండాకాలంలో మాత్రం కాస్తంత ఎక్కువ శ్రద్ధ అవసరం. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఏ క్షణంలోనైనా శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. శరీరంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎండలోకి వెళ్లాక షుగర్ పడిపోతే అలాంటప్పుడు ఏం చేయాలనే సందేహం మీకూ ఉందా? నిపుణులు ఇచ్చే ఈ సలహాలు తప్పక పాటించండి....

Summer Health Care: డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోనే!
Summer Health Care
Srilakshmi C
|

Updated on: Apr 25, 2024 | 1:27 PM

Share

డయాబెటిక్ రోగులు ఏడాది పొడవునా ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ఎండాకాలంలో మాత్రం కాస్తంత ఎక్కువ శ్రద్ధ అవసరం. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఏ క్షణంలోనైనా శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. శరీరంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎండలోకి వెళ్లాక షుగర్ పడిపోతే అలాంటప్పుడు ఏం చేయాలనే సందేహం మీకూ ఉందా? నిపుణులు ఇచ్చే ఈ సలహాలు తప్పక పాటించండి..

తగినంత నీరు తాగాలి

వేడికి శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు తరచుగా మూత్రవిసర్జన ఉంటుంది. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు వేసవిలో కనీసం 4 లీటర్ల నీరు తాగాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ వ్యాధి ప్రమాదం ఎక్కువ. నీరు తగినంత తాగడం ద్వారా ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

సమతుల్య ఆహారం

షుగర్‌ పేషెంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసవిలో ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె-మసాలా ఆహారాలు తినకూడదు. రోడ్డుపక్కన దొరికే శీతల పానీయాలు, పండ్ల రసాలు కూడా తాగ కూడదు. వేసవిలో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటే ఇంకా మంచిది.

ఇవి కూడా చదవండి

వ్యాయామం తప్పనిసరి

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి రోజుకు కనీసం 30 నిమిషాల యోగా తప్పనిసరిగా చేయాలి. యోగా చేయలేకపోతే, సాయంత్రం వాకింగ్ చేయాలి. ఉదయం పూట ఎండలో నడవడం చాలా మందికి కష్టంగా ఉంటుంది.

రోజుకు ఒక్కసారైనా అన్నం తినాలి

మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్నం తక్కువగా తినాలి. అయితే అన్నం తినడం పూర్తిగా మానేయకూడదు. చాలా మంది వేసవిలో పాంటా రైస్ తినడానికి ఇష్టపడతారు. ఈ ఆహారం వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. రోజుకు ఒకసారి పాంటా రైస్ తినడం మంచిదే.

మామిడి పండ్లకు దూరంగా ఉండాలి

కీర దోసకాయలు, పుచ్చకాయలు, పైనాపిల్స్, ద్రాక్ష వంటి వేసవి పండ్లు తినవచ్చు. అయితే మామిడి పండ్లకు మాత్రం దూరంగా ఉండాలి. పండిన మామిడి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అయితే పండిన మామిడికాయలు వారానికి 3-4 మామిడి పండ్లను తినవచ్చు. అంతకంటే ముందు వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవడం మర్చిపోకూడదు.

ORS తాగాలి

సూర్యరశ్మికి గురికావడం వల్ల చెమట పట్టడంతో శరీరం నుంచి నీరు వేగంగా బయటికి పోతుంది. ఈ స్థితిలో శరీరం అలసిపోయి షుగర్ ఫాల్ట్ అయ్యే అవకాశం ఉంది. విపరీతంగా చెమటలు పట్టి అనారోగ్యంగా అనిపిస్తే ORS తాగవచ్చు. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబందిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.