పుచ్చకాయ చికెన్ బిర్యానీ రెసిపీ.. ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి సామీ
వంట చేస్తున్న ఇద్దరు యువకులు పుచ్చకాయలను కట్ చేసి ముక్కలుగా చేయడంతో వీడియో ప్రారంభమవుతుంది. అప్పుడు తాము తరిగిన పండ్ల ముక్కలను పెద్ద కంటైనర్‌లోకి బదిలీ చేశారు. ఈ ముక్కలను గుజ్జు చేసి రసాన్ని తీశారు. పుచ్చకాయ రసాన్ని మరొక కంటైనర్‌లో వడకట్టారు. తరువాత చికెన్ ముక్కలను శుభ్రం చేశారు. పెద్ద కడాయిలో వంట నూనె, మసాలాలు, ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా సిద్ధం చేశారు.
బిర్యానీ చిన్న పెద్దలకు ఇష్టమైన ఆహారం.. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, సి ఫుడ్ బిర్యానీలు మాత్రమే కాదు వెజిటబుల్ బిర్యానీ ఇలా రకారకాల బిర్యానీలను ఆహార ప్రియులు ఇష్టంగా ఇంటరు. రుచికరమైన బిర్యానీ భారతీయులకు మాత్రమే కాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి ఇష్టమైన వంటకం.
వేడిగా, రుచిగా ఉండే బిర్యానీ దేశంలోని ఒకొక్క ప్రాంతాల్లో ఒకొక్క రకంగా తయారు చేస్తారు. అది చికెన్ లేదా మటన్ బిర్యానీ అయినా వేడి వేడిగా తింటే ఆహా అనాల్సిందే ఎవరైనా.. అయితే ఇతర వంటల మాదిరిగానే, బిర్యానీలో కూడా అనేక రకాలైన బిర్యానీలు ఉన్నాయి. అయితే తాజాగా పుచ్చకాయ చికెన్ బిర్యానీ తయారీ రెసిపీ వీడియో వైరల్ అవుతుంది.
ఇన్‌స్టాగ్రామ్ పేజీ @villagefoodchannel_officialలో షేర్ చేసిన ఈ వీడియోలో ఈ బిర్యానీని తయారు చేసే వ్యక్తులు ఎవర్‌గ్రీన్ డిష్ బిర్యానీని పుచ్చకాయతో ఎలా చేయాలో చూపించారు.
వంట చేస్తున్న ఇద్దరు యువకులు పుచ్చకాయలను కట్ చేసి ముక్కలుగా చేయడంతో వీడియో ప్రారంభమవుతుంది. అప్పుడు తాము తరిగిన పండ్ల ముక్కలను పెద్ద కంటైనర్‌లోకి బదిలీ చేశారు. ఈ ముక్కలను గుజ్జు చేసి రసాన్ని తీశారు. పుచ్చకాయ రసాన్ని మరొక కంటైనర్‌లో వడకట్టారు. తరువాత చికెన్ ముక్కలను శుభ్రం చేశారు. పెద్ద కడాయిలో వంట నూనె, మసాలాలు, ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా సిద్ధం చేశారు. వేగిన అనంతరం చికెన్ ముక్కలను అందులోకి చేర్చారు. పదార్థాలన్నీ కలిపిన తర్వాత రకరకాల మసాలా దినుసులు వేసి చికెన్‌ని వేశారు. పుచ్చకాయ రసాన్ని వేసి బాగా కలిపి దీనిలో బాస్మతి బియ్యాన్ని వేశారు. బిర్యానీ రెడీ అయిన తర్వాత దానిని అందంగా అలంకరించారు.
పుచ్చకాయ చికెన్ బిర్యానీ పూర్తి వీడియో క్రింద చూడండి:
View this post on Instagram
ఇప్పటివరకు, వీడియో 400K లైక్‌లను, 81 లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. పుచ్చకాయ, చికెన్ బిర్యానీ కలయికను చూసి పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి “విజయవంతంగా వృధా అయిన పుచ్చకాయలు” అని వ్యాఖ్యానించగా మరొకరు “ఆహారాన్నిశక్తినిచ్చే పదార్థంగా ఉపయోగించుకునే రోజులను నేను కోల్పోతున్నానని కామెంట్ చేశారు. “పుచ్చకాయ కలపడం వ్యర్థం.. విడిగా తినవచ్చ, “గొప్ప వంటకం బిర్యానీ దయచేసి పాడుచేయకండి అని రకరకాల కామెంట్ చేయగా..తాను ఒక్కసారి రుచి చూడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు ఒకరు.. అయితే ఇది తిన్న తర్వాత తిన్న తర్వాత అంబులెన్స్ కోసం ఎదురుచూడాల్సిందే నేను ఎప్పటికీ రుచి చూడను అని వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..