AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు, ప్రజలు మృతి..

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో దోమల సంతానోత్పత్తి, మండే వేడి, చిత్తడి నేలలు, భారీ వర్షాల కారణంగా ఏర్పడిన బురద సైనికుల సమస్యలను మరింత పెంచింది. దోమల కారణంగా సైనికులు మలేరియా బారిన పడడంతో రణరంగంలో పరిస్థితి మారిపోయింది. 1942లోనే అమెరికా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన 75 వేల మంది సైనికులు మలేరియా బారిన పడ్డారు. జపాన్‌తో జరిగిన యుద్ధంలో భారీ సంఖ్యలో సైనికులు మలేరియా బారిన పడ్డారు.

ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు, ప్రజలు మృతి..
World Malaria Day 2024
Surya Kala
|

Updated on: Apr 25, 2024 | 4:12 PM

Share

దోమల వలన అనేక వ్యాధులు కలుగుతాయన్న సంగతి తెలిసిందే.. అలా ఆడ దోమ వలన కలిగే వ్యాధి  మలేరియా వ్యాధి. వ్యాధికి చికిత్స ఉన్నప్పటికీ మలేరియా బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆరు లక్షల మందికి పైగా మరణిస్తున్నారని వరల్డ్ హెల్త్ సంస్థ వెల్లడించింది. దీనిని బట్టి దోమ మానవులకు ఎంత ప్రమాదకరమో అంచనా వేయవచ్చు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 20 కోట్ల మందికి పైగా ప్రజలు మలేరియా బారిన పడుతున్నారు. ఒకప్పుడు ఒకవైపు ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంటే మరో వైపు ఈ వ్యాధి సైనికులకు, సామాన్యులకు కూడా సమస్యగా మారింది. ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రపంచ యుద్ధంలో ఈ వ్యాధి ఎలాంటి విధ్వంసం సృష్టించిందో తెలుసుకుందాం.

సాధారణంగా శరీరం వణుకుతో కూడిన అధిక జ్వరం, జలుబుతో ఇబ్బంది పడితే దానిని మలేరియాగా  గుర్తిస్తారు. ఈ జ్వరం ఆడ అనాఫిలిస్ దోమ కారణంగా వస్తుంది. ఈ ఆడ దోమ ఎవరినైనా కుట్టినప్పుడు..  ప్లాస్మోడియం పరాన్నజీవులు దాని లాలాజలం ద్వారా శరీరంలోకి వ్యాపిస్తాయి. ఈ పరాన్నజీవి వల్ల మలేరియా వస్తుంది.

ప్రపంచ యుద్ధ సమయంలో విధ్వంసం

మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం 28 జూలై 1914 నుంచి నవంబర్ 11, 1918 వరకు ప్రపంచంలోని వివిధ దేశాల సైన్యాలు ఒకదానికొకటి తలపడుతున్నాయి. ఈ సమయంలో మలేరియా వ్యాధి కూడా విజృంభించింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 9 కోట్ల మంది సైనికులు, 1.3 కోట్ల మంది పౌరులు కూడా మరణించారు. ఇక యుద్ధం ముగిసే సమయం అంటే 1918లో వ్యాపించిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల మంది ప్రజల ప్రాణాలను బలిగొంది. మలేరియా వ్యాధి భారీ సంఖ్యలో ప్రజల మరణానికి కారణమైంది.

ఇవి కూడా చదవండి

ఐదు లక్షల మందికి పైగా ప్రభావితులు

సెప్టెంబర్ 1, 1939 న రెండో ప్రపంచం యుద్ధం నగారా మ్రోగింది. ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాల సైన్యాలు మరోసారి కదన రంగంలోకి కాలుబెట్టాయి. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో ఐదు కోట్ల మందికి పైగా ప్రజలు మరణించారు. ఈ సమయంలో మలేరియా తీవ్రమైన రూపం దాల్చింది. అమెరికా దళాలకు మలేరియా వ్యాధి శత్రువుగా మారింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఐదు లక్షల మందికి పైగా ప్రజలు మలేరియా బారిన పడ్డారు. ఆఫ్రికా, దక్షిణ పసిఫిక యుద్ధాల సమయంలో 60 వేల మందికి పైగా అమెరికా  సైనికులు మలేరియా కారణంగా మరణించారు.

చాలా మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో దోమల సంతానోత్పత్తి, మండే వేడి, చిత్తడి నేలలు, భారీ వర్షాల కారణంగా ఏర్పడిన బురద సైనికుల సమస్యలను మరింత పెంచింది. దోమల కారణంగా సైనికులు మలేరియా బారిన పడడంతో రణరంగంలో పరిస్థితి మారిపోయింది. 1942లోనే అమెరికా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన 75 వేల మంది సైనికులు మలేరియా బారిన పడ్డారు. జపాన్‌తో జరిగిన యుద్ధంలో భారీ సంఖ్యలో సైనికులు మలేరియా బారిన పడ్డారు. వారిలో 57 వేల మంది సైనికులు ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గణాంకాల ప్రకారం ఆ సమయంలో దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలో మోహరించిన సైనికులలో 60-65 శాతం మంది మలేరియా బారిన పడ్డారు.

ఇప్పటికీ ప్రపంచాన్ని వెంటాడుతోన్న మలేరియా

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డేటా ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో 249 మిలియన్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇందులో 6,08,000 మంది మరణించారు. ప్రపంచం మొత్తంతో పోలిస్తే ఆఫ్రికన్ ప్రాంతంలో మలేరియా కేసులు అత్యధికంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2022 సంవత్సరంలో మొత్తం మలేరియా కేసుల్లో 94 శాతం అంటే 233 మిలియన్ కేసులు ఈ ప్రాంతంలోనే నమోదయ్యాయి.

మొత్తం మరణాలలో 95 శాతం అంటే 5,80,000 మరణాలు ఈ ప్రాంతంలోనే సంభవించాయి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 80 శాతం మంది ఈ ప్రాంతంలో మరణించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా ప్రభావిత దేశాల్లో ఈ వ్యాధిని అరికట్టేందుకు ఉత్తమ ప్రయత్నాలు చేసినప్పటికీ 2021తో పోలిస్తే 2022లో మలేరియా కేసులు ఆశ్చర్యకరంగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 2022లో 249 మిలియన్ కేసులు, 2021లో 244 మిలియన్ కేసులు నమోదయ్యాయి. 2021లో కొంచెం ఎక్కువ మరణాలు సంభవించాయి. ఈ వ్యాధి కారణంగా 6,10,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..