ఇక్కడ శివయ్యని పూజిస్తే కోరిన వరుడు లభిస్తాడని విశ్వాసం.. మేక తలతో దక్షుడి ఆలయం.. ఎక్కడంటే

తనకు పుట్టింటి నుంచి ఆహ్వానం అందకపోవడంతో తల్లి సతీదేవి కొంచెం ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తన పుట్టింటికి వెళ్ళడానికి తనకు ఆహ్వానం ఎందుకు తాను వెళ్తానని తన భర్త శివుడికి చెప్పింది. తల్లిదండ్రులను చూసి చాలా కాలం అయింది. అందుకనే యాగం చూసేందుకు పుట్టింటికి వెళ్తానని తన భర్త శివుడిని కోరింది. సతీదేవి కోరికను శివుడి అంగీకరించకపోయినా సరే.. తల్లిదండ్రులను చూడాలి అంటూ దక్షుని ఇంటికి చేరుకుంది. అక్కడ విష్ణువు, బ్రహ్మతో సహా దేవతలందరికి ఆసనాలు వేసి ఉన్నాయి. అయితే  ఎక్కడా శివుడి పేరు లేదు.

ఇక్కడ శివయ్యని పూజిస్తే కోరిన వరుడు లభిస్తాడని విశ్వాసం.. మేక తలతో దక్షుడి ఆలయం.. ఎక్కడంటే
Lord Shiva
Follow us
Surya Kala

|

Updated on: Apr 25, 2024 | 3:38 PM

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని కంఖాల్ గ్రామంలో దక్షేశ్వర మహాదేవ ఆలయం ఉంది. ఇదే దేవాలయంలో దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. ఈ యజ్ఞానాన్ని నిర్వహించే సమయంలో దేవుళ్ళు, దేవతలు, ఋషులు, సాధువులందరినీ ఆహ్వానించారు. అయితే శంకరుడిని ఆహ్వానించలేదు. దక్షుడు శివునికి చేసిన  అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞవాటికలోని అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసింది. ఈ విషయం తెలుసుకున్న మహా శివుడు కోపంతో దక్షుని తల నరికేశాడు. దేవతల అభ్యర్థన మేరకు శివుడు దక్షప్రజాపతికి  ప్రాణం పోసి మేక తలని అతని మొండానికి అతికించాడు.

దీని తరువాత దక్షుడు తన తప్పును గ్రహించి శివుడిని క్షమించమని కోరాడు. అప్పుడు శివుడు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శివుడు కంఖాల్‌లో ఉంటాడని వరం ఇచ్చాడు. శివునికి శంకరుడు, మహాదేవుడు, మహేశ్వరుడు, ఉమాపతి వంటి అనేక పేర్లు ఉన్నాయి. అలాంటి పేర్లలో ఒకటి భోలేనాథ్. తన భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తాడు. అంతేకాదు తనను పూజించిన యువతులకు కోరిన వరుడిని భర్తగా ఇస్తాడు. అయితే శంకరుడు ఎంత సాదాసీదాగా ఉంటాడో.. అంత కోపం కలిగి ఉంటాడు. అందుకే తన భార్య మరణంతో శివువు ఆగ్రహంతో తన మామగారైన దక్ష ప్రజాపతి తలను నరికివేశాడు.

పురాణ కథనం ఏమిటంటే..

పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి బ్రహ్మ దేవుడు వరపుత్రుడు. సతీ తల్లికి తండ్రి. సతికి తండ్రి అయినందున,  శివుడికి మామ గారు కూడా.. శివునితో సతీ దేవి వివాహం దక్షుడికి ఇష్టం లేదు. అందుకనే శివుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తన కూతురు సతీదేవితో సంబంధాలను తెంచుకున్నాడు దక్షుడు. ఒకానొక సమయంలో, సతీదేవి, శివుడు కైలాసంలో కూర్చున్నారు. ఆ సమయంలో దక్ష మహారాజు ఒక భారీ యాగాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ యాగానికి అతిధులుగా బ్రహ్మ, విష్ణు సహా దేవతలు, యక్షులు, గంధర్వులు మొదలైన వారందరికీ ఆహ్వానాలు అందాయి.

ఇవి కూడా చదవండి

తనకు పుట్టింటి నుంచి ఆహ్వానం అందకపోవడంతో తల్లి సతీదేవి కొంచెం ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తన పుట్టింటికి వెళ్ళడానికి తనకు ఆహ్వానం ఎందుకు తాను వెళ్తానని తన భర్త శివుడికి చెప్పింది. తల్లిదండ్రులను చూసి చాలా కాలం అయింది. అందుకనే యాగం చూసేందుకు పుట్టింటికి వెళ్తానని తన భర్త శివుడిని కోరింది. సతీదేవి కోరికను శివుడి అంగీకరించకపోయినా సరే.. తల్లిదండ్రులను చూడాలి అంటూ దక్షుని ఇంటికి చేరుకుంది. అక్కడ విష్ణువు, బ్రహ్మతో సహా దేవతలందరికి ఆసనాలు వేసి ఉన్నాయి. అయితే  ఎక్కడా శివుడి పేరు లేదు. అంతేకాదు పిలవకుండా వచ్చిన కూతుర్ని చూసిన దక్షుడు సతి దేవిని అవమానించాడు. కూతురు పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన సతీదేవి యజ్ఞవాటికలో  దూకి ప్రాణత్యాగం చేసింది.

శివునికి కోపం వచ్చింది

ఈ విషయం శివునికి తెలియగానే కోపంతో యాగశాలకు చేరుకున్నాడు. యజ్ఞశాలలో తన భార్య సతీదేవి కాలిపోయిన శరీరాన్ని చూ శివుడు కోపంతో దక్షుడి తలను నరికివేశాడు. ఆ తరువాత కూడా శివుని కోపం చల్లారలేదు. అతను సతీ దేవి కాలిన మృత దేహాన్ని మోస్తూ భూమి అంతా తిరుగడం ప్రారంభించాడు.  ఇదంతా చూసిన శ్రీ హరి తన సుదర్శన  చక్రంతో సతీదేవి శరీర భాగాలను ఒక్కొక్కటిగా కత్తిరించడం ప్రారంభించాడు. మాతా సతి శరీర భాగాలు పడిపోయి భూమిపై 52 ప్రదేశాలలో పడ్డాయి. అవి  52 శక్తిపీఠాలుగా ఏర్పాటు అయ్యాయి. ఇవి నేటికీ హిందువుల ప్రధాన విశ్వాస కేంద్రాలుగా ఉన్నాయి.

దక్షుడికి మేక తల ఇవ్వబడింది

దేవతల ప్రార్థనతో శివయ్య కోపం తగ్గింది. అప్పుడు బ్రహ్మ దేవుడు శివుడి వద్ద వెళ్లి మొదట శివునికి సతీదేవి పునర్జన్మ గురించి చెప్పి ప్రసన్నం చేసుకున్నాడు. అనంతరం తన కుమారుడైన దక్షుని ప్రాణం కోసం వేడుకున్నాడు. అప్పుడు భోలేనాథ్ దక్షుని తల స్థానంలో మేక తల పెట్టి ప్రజాపతి దక్షుడికి ప్రాణం పోశాడు.

మేక తలను ఎందుకు ఉపయోగించారు?

శివుడు తన అనుచరుడితో ఒక మేక తలను నరికి తీసుకురమ్మని చెప్పాడు. అప్పుడు బ్రహ్మా దేవుడు  మాట్లాడుతూ మేక తల మాత్రమే ఎందుకు అడిగారు? ఏనుగు, సింహం, ఏదైనా కావాల‌ని అడిగారు. నందీశ్వరుడు దక్షుడిని వచ్చే జన్మలో మేకగా జన్మిస్తాడని శపించాడని శివుడు చెప్పాడు. దీని తరువాత, ఒక మేక తలను తీసుకువచ్చి, దానిని దక్షుని శరీరానికి అతికించి, అతన్ని తిరిగి బ్రతికించారు. దీని తర్వాత దక్షుడు శివుడిని స్తుతించి క్షమాపణలు కోరాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే