AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ekadashi Puja Tip: ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి.. వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది

ఆర్ధికంగా పురోగతిని కోరుకుంటే కామద ఏకాదశి రోజున స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించండి. దీని తరువాత 'ఓం నమో భగవతే నారాయణ' అని చెప్పి, తులసి మొక్కకు 11 సార్లు నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆర్ధికంగా పురోగమించే అవకాశాలు ఉన్నాయట. ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును పూజించడమే కాకుండా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. కామద ఏకాదశి రోజున ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Ekadashi Puja Tip: ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి.. వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది
Ekadashi Puja Tip
Surya Kala
|

Updated on: Apr 19, 2024 | 2:25 PM

Share

నేడు శుక్రవారం కామద ఏకాదశి ఉపవాస దీక్షను చేపట్టారు. చైత్ర మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తేదీని కామద ఏకాదశి అంటారు. కామద ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. ఏకాదశి ఉపవాసం రోజున శ్రీ మహా విష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును పూజించడమే కాకుండా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. కామద ఏకాదశి రోజున ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ఏకాదశి రోజున వ్యాపారస్తులు చేయాల్సిన పద్ధతులు

పురోభివృద్ధి కోసం: ఆర్ధికంగా పురోగతిని కోరుకుంటే కామద ఏకాదశి రోజున స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించండి. దీని తరువాత ‘ఓం నమో భగవతే నారాయణ’ అని చెప్పి, తులసి మొక్కకు 11 సార్లు నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఆర్ధికంగా పురోగమించే అవకాశాలు ఉన్నాయట.

వ్యాపారంలో లాభదాయకం: వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారస్తులు ఏకాదశి రోజు సాయంత్రం విష్ణువును పూజించే సమయంలో పసుపు వస్త్రాన్ని తీసుకొని దానిలో 2 పసుపు కొమ్ములు, ఒక వెండి నాణెం వేసి ఒక మూటగా ముడి వేయండి. వెండి నాణెం లేకపోతే ఆ వస్త్రాన్ని ఒక సాధారణ రూపాయి నాణెం ఉంచండి. అప్పుడు విష్ణువు పటం ముందు ఆ వస్త్రాన్ని భద్రపరచండి. ఇలా చేయడం ద్వారా  వ్యాపారం వేగంగా నడుస్తుంది.

ఇవి కూడా చదవండి

విజయాన్ని పొందడానికి: ఏకాదశి రోజున ఏదైనా శుభకార్యాల కోసం బయటకు వెళుతుంటే ఇంటి నుంచి  బయలుదేరేటప్పుడు పసుపును తిలకంగా దిద్దుకోండి. ఇలా చేయడం వలన పనిలో సహాయపడుతుంది. కొన్ని రోజుల తరువాత ఏదైనా పని మీద లేదా వ్యాపార సమావేశానికి వెళితే కామద ఏకాదశి సాయంత్రం, తెల్లటి దూది తీసుకుని పొడవైన దారానికి పసుపు అద్ది.. శ్రీహరి పాదాల వద్ద ఉంచి ప్రార్థించండి. దీనిని ఏడు రోజులు పని నిమిత్తం బయటకు వెళ్లినప్పుడల్లా ఈ దారాన్ని మీ జేబులో లేదా పర్సులో పెట్టుకోండి.

ఆర్థికాభివృద్ధికి: ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థిక స్థితి మెరుగుపడక పోయినా, ధనలాభం కలగకపోయినా, శ్రీ హరి విష్ణువు కోసం కామద ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి. అంతే కాకుండా పసుపు పట్టు గుడ్డలో ఏడు పసుపు కొమ్ములు కట్టి అరటిచెట్టు కింద పెట్టాలి. ఇలా చేయడం వల్ల త్వరలో లాభాలను పొందుతారు.

కెరీర్‌లో పురోగతి కోసం: వృత్తిలో పురోగతి కోసం లేదా వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లడానికి ఏకాదశి రోజున రావి చెట్టు దగ్గర పసుపుతో స్వస్తికను చేసి.. శ్రీ హరి పాదాల వద్ద ‘ఓం నమో భగవతే నారాయణ’ అని చెప్పండి. పసుపు రంగు స్వీట్లను, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..