Vastu Tips: ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి..

సాలెగూడు ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి స్థిరంగా ఉండదు. అందుకే ఇంట్లో ఉండే సాలెగూడును ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. సాలెగూడును ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచితే డబ్బులకు ఇబ్బందులు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఏర్పడవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ప్రతికూల వాతావరణం పెరుగుతుంది. ఇంట్లో సాలె గూళ్లు ఉంటే ఏర్పడే ప్రతికూలత గురించి ఈ రోజు తెలుసుకుందాం.. 

Vastu Tips: ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి..
Vastu Tips In Home
Follow us
Surya Kala

|

Updated on: Apr 25, 2024 | 4:46 PM

ఇల్లు శుభ్రంగా అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఎంత శుభ్రంగా ఇంటిని పెట్టుకున్నా.. ఇంటి ఏ మూలలోనో సాలె గూళ్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సాలె గూళ్లు  శుభప్రదంగా పరిగణించబడదు. ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. అంతేకాదు ఆర్ధికంగా ఇబ్బంది పడే  అవకాశాలు కూడా కనిపిస్తాయి. దీనికి కారణం సాలెగూడు ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి స్థిరంగా ఉండదు. అందుకే ఇంట్లో ఉండే సాలెగూడును ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. సాలెగూడును ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచితే డబ్బులకు ఇబ్బందులు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఏర్పడవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ప్రతికూల వాతావరణం పెరుగుతుంది. ఇంట్లో సాలె గూళ్లు ఉంటే ఏర్పడే ప్రతికూలత గురించి ఈ రోజు తెలుసుకుందాం..

  1. ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉంటే కుటుంబ సభ్యుల మధ్య ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడతాయి. డబ్బులను పోగొట్టుకుంటారు.
  2. బెడ్ రూమ్ లో సాలెగూడు ఉంటే కుటుంబ సభ్యుల మధ్య అశాంతి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు కలుగుతాయి.
  3. పూజ గదిలో సాలెగూడు ఉంటే జీవితంలో అనుకోని అనేక అనర్ధాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి వ్యక్తిగత చికాకులు కలుగుతాయి.
  4. వంటగదిలో సాలెగూడు ఉంటే అశుభాలు కలిగే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ఇంట్లో సాలె గూళ్లను శుభ్రం చేయకుండా ఉంచితే వాస్తు దోషంతో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఇంటిలో ఎక్కడైనా బూజులు, సాలె గూళ్లు ఉంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు