డబ్బు ఆదా చేయడానికి యువకుడు చేసిన పని వీడియో వైరల్.. ఉద్యోగం నుంచి తొలగింపు

ఆ యువకుడు తన ఉద్యోగాన్ని కోల్పోయినట్లు ఆరోపించాడు. మెహుల్ ప్రజాపతి అనే యువకుడు తనకు ఉచిత ఆహారాన్ని అందించే ప్రదేశాలను వెల్లడించాడు. అవి ఛారిటీ ఫుడ్ బ్యాంక్‌లు, కళాశాలు,  విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ట్రస్టులు, చర్చిలు, NGOలచే నిర్వహించబడుతున్న వాటిల్లో తాను రోజూ ఆహారాన్ని తినేవాడినని చెప్పాడు. ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టింది.  మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో.. తరువాత సోషల్ సైట్‌లో చర్చ జరిగింది.

డబ్బు ఆదా చేయడానికి యువకుడు చేసిన పని వీడియో వైరల్.. ఉద్యోగం నుంచి తొలగింపు
Indian Origin Youth VideoImage Credit source: X/@Slatzism
Follow us
Surya Kala

|

Updated on: Apr 25, 2024 | 2:59 PM

కొంతమంది తాము సంపాదించిన డబ్బులతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. మరికొందరు తాము ఎంత సంపాదించినా దానిని దాచడమే లక్ష్యంగా జీవిస్తారు. అలా ఓ యువకుడు తన జీతాన్ని ఆదా చేయడానికి ఒక ఉపాయాన్ని అనుసరించాడు. ఆ తర్వాత దానిని తాను ఎలా డబ్బులను దాస్తున్నాడో గొప్పగా చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఆ యువకుడు తన ఉద్యోగాన్ని కోల్పోయాడు.  ఆ యువకుడు వృత్తి రీత్యా డేటా సైంటిస్ట్ . ఇతని వార్షిక ఆదాయం రూ.81 లక్షలు. ఇటీవల ఆ యువకుడు  ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో ఉచిత ఆహారం తింటూ వారానికి తాను డబ్బులను  ఎలా ఆదా చేస్తున్నాడో చెప్పాడు. అయితే ఆ సమయంలో తన వీడియో వైరల్‌గా మారితే..  ఉద్యోగం పోతుందనే ఆలోచన కూడా అతనికి ఉండకపోవచ్చు.

ఆ యువకుడు తన ఉద్యోగాన్ని కోల్పోయినట్లు ఆరోపించాడు. మెహుల్ ప్రజాపతి అనే యువకుడు తనకు ఉచిత ఆహారాన్ని అందించే ప్రదేశాలను వెల్లడించాడు. అవి ఛారిటీ ఫుడ్ బ్యాంక్‌లు, కళాశాలు,  విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ట్రస్టులు, చర్చిలు, NGOలచే నిర్వహించబడుతున్న వాటిల్లో తాను రోజూ ఆహారాన్ని తినేవాడినని చెప్పాడు. ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టింది.  మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో.. తరువాత సోషల్ సైట్‌లో చర్చ జరిగింది

ఇవి కూడా చదవండి

మెహుల్ వీడియోను @Slatzism హ్యాండిల్‌తో షేర్ చేశారు. TD బ్యాంక్ ఆఫ్ కెనడాలో డేటా సైంటిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. వార్షిక జీతం 98,000 డాలర్లు (అంటే మన దేశ కరెన్సీలో సుమారుగా 81 లక్షలు). ఐఐటీ ఇతను తన జీతాన్ని ఖర్చు పెట్టి తినడానికి ఇష్టపడక.. ఉచితంగా ఆహారాన్ని అందించే ఛారిటీ ఫుడ్ బ్యాంక్ ల నుంచి ఆహారాన్ని తింటున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. అదేదో గొప్ప విషయం అన్నచందంగా గర్వంగా చెబుతున్నాడు.. అయితే ఈ వీడియో పై సర్వత్రా నిరసన వ్యక్తం అయింది. అంతేకాదు అతని కంపెనీ అతని ఉద్యోగం నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ ధ్రువీకరించలేదు.

సంచలనం సృష్టించిన మెహుల్ వీడియో ఇక్కడ చూడండి

ఛారిటీ బ్యాంక్ నుంచి ఆహారం దొంగిలించే దొంగ ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడని X వినియోగదారు ట్వీట్ చేశారు. వినియోగదారు TD కెనడా స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసారు. అయితే అందులో ఎక్కడా మెహుల్ పేరు ప్రస్తావించలేదు.

టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం మెహుల్ కుటుంబం దీనిని ఖండించింది. గత ఏడాది డిసెంబర్‌లో ఆ కంపెనీలో మెహుల్ ఇంటర్న్‌షిప్ మాత్రమే చేశాడని చెప్పారు. అయితే అతని ఉద్యోగం పోయింది అనే వార్తను టీవీ 9 ధ్రువీకరించలేదు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే