వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో.. కుక్కను చూసి పలాయన మంత్రం పఠించిన మొసలి
ఏమిటి మొసలిని కుక్క భయపెడుతుందా అని అనుకుంటున్నారా.. అవును కుక్క కూడా అద్భుతాలు చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూసిన తర్వాత, మీ ఆలోచన ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే మన వేమన చెప్పిన నీళ్లలో మొసలి తనకంటే పెద్దదైన ఏనుగుని కూడా పడుతుంది.. అదే నేల మీద కుక్క చేతిలో కూడా ఓడిపోతుంది అని చెప్పిన మాటకు సజీవ సాక్ష్యం ఈ వీడియో
ప్రపంచంలో భయంకరమైన జీవుల్లో ఒకటి మొసలి. ఇది నీటిలో లేదా నేల మీద జీవిస్తుంది. అయితే నీటిలో దీని బలం అధికంగా ఉంటుంది. అయితే మొసలిని రీల్‌లో లేదా రియల్‌గా చూసినా భయపడతారు. అయితే మొసలి మీ ఎదురుగా వస్తే.. వణుకు పుడుతుంది కూడా.. అయితే కుక్క ఉంటే మీరు చింతించాల్సిన అవసరం లేదు! ఏమిటి మొసలిని కుక్క భయపెడుతుందా అని అనుకుంటున్నారా.. అవును కుక్క కూడా అద్భుతాలు చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూసిన తర్వాత, మీ ఆలోచన ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే మన వేమన చెప్పిన నీళ్లలో మొసలి తనకంటే పెద్దదైన ఏనుగుని కూడా పడుతుంది.. అదే నేల మీద కుక్క చేతిలో కూడా ఓడిపోతుంది అని చెప్పిన మాటకు సజీవ సాక్ష్యం ఈ వీడియో
అమెరికాలోని ఫ్లోరిడాలో మొసళ్ల రోడ్లు, ఇంటి పరిసరాల్లో కనిపించడం సర్వసాధారణం. అయితే ఇంటర్నెట్‌లో యాక్టివ్‌గా ఉంటే, ప్రతిరోజూ ఫ్లోరిడా మొసళ్లకు సంబంధించిన ఆశ్చర్యకరమైన వీడియోలను చూడవచ్చు. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత ప్రజలు తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. వాస్తవానికి, ఈ వైరల్ క్లిప్‌లో ఒక కుక్క మొసలిని ఓడించింది.
ఇక్కడ వీడియో చూడండి
View this post on Instagram
ఓ మహిళ తన ఇంటిలోపల నుంచి తోటను చూస్తున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. ఈ సమయంలో ఆమె తన తోటలో ఒక మొసలిని చూసింది. అప్పుడు ఆమె మొదట్లో చాలా కంగారుపడింది. తన యజమానురాలు కంగారుపడటం చూసిన ఆమె పెంపుడు గబాగబాగా ఆ వృద్ధురాలి దగ్గరకు వచ్చింది. ఇంట్లోకి చకచకా వస్తున్న మొసలిని చూసి నోటికి పని చెప్పి కుక్క మొరగడం ప్రారంభించింది. దీంతో మొసలి పరారీ బాట పట్టింది.
ఈ వీడియో ఇన్‌స్టాలో natalia_rojas_art అనే ఖాతా ద్వారా భాగస్వామ్యం చేయబడింది. మూడు లక్షల మందికి పైగా లైక్ చేశారు. కోట్లాది మంది చూశారు. అంతేకాదు దీనిపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక వినియోగదారు ‘నిజంగా ఒక కుక్క మీ ఇంటికి నిజమైన రక్షకుడు.’ మరొకరు, ‘కుక్క బయట ఉండి ఉంటే, అది ఖచ్చితంగా మొసలిని చంపి ఉండేది’ అని కామెంట్ చేశారు. చాలా మంది ఇతర వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించడం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..