AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్ళైన యువతికి ప్రధాన ఆభరణం మంగళసూత్రం.. ఎందుకు ధరిస్తారు? నమ్మకం ఏమిటంటే

వివాహానంతరం స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్షు కోసం పదహారు అలంకారాలను చేసుకోవాలని హిందూ మతంలో ఒక నమ్మకం. ఇందులో మంగళసూత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మంగళసూత్రం వివాహిత స్త్రీలను చెడు ద్రుష్టి నుంచి రక్షిస్తుంది. మంగళసూత్రాన్ని కోల్పోవడం లేదా తెగడం వంటి వాటిని చెడు  శకునాలుగా పరిగణిస్తారు. మంగళసూత్రం వధువు ప్రధాన ఆభరణం. ఎల్లప్పుడూ ధరిస్తారు. మంగళసూత్రం  వైభవం, ప్రాధాన్యత గురించి ప్రాచీన కాలం నుంచి చెప్పారు. 

పెళ్ళైన యువతికి ప్రధాన ఆభరణం మంగళసూత్రం.. ఎందుకు ధరిస్తారు? నమ్మకం ఏమిటంటే
Hindu Women Wear Mangalsutra
Surya Kala
|

Updated on: Apr 24, 2024 | 7:34 PM

Share

వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. సనాతన ధర్మాన్ని నమ్మే వివాహిత మహిళలకు మంగళసూత్రం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇంకా చెప్పాలంటే వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ధరించడం కూడా వివాహానికి చిహ్నంగా పరిగణిస్తారు.  వధువు మంగళసూత్రం ధరించడం వివాహానికి సంబంధించిన ప్రధాన ఆచారాలలో ఒకటి. పురాణ మత గ్రంధాల ప్రకారం, మంగళసూత్రం స్త్రీకి వివాహానికి సంకేతంగా పరిగణించబడుతుంది. వివాహానంతరం మంగళసూత్రం ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతారని నమ్ముతారు. మంగళసూత్రం అనేది వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బంధించి ఉంచే బలమైన సాంప్రదయంగా నమ్మకం.

వివాహానంతరం స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్షు కోసం పదహారు అలంకారాలను చేసుకోవాలని హిందూ మతంలో ఒక నమ్మకం. ఇందులో మంగళసూత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మంగళసూత్రం వివాహిత స్త్రీలను చెడు ద్రుష్టి నుంచి రక్షిస్తుంది. మంగళసూత్రాన్ని కోల్పోవడం లేదా తెగడం వంటి వాటిని చెడు  శకునాలుగా పరిగణిస్తారు. మంగళసూత్రం వధువు ప్రధాన ఆభరణం. ఎల్లప్పుడూ ధరిస్తారు. మంగళసూత్రం  వైభవం, ప్రాధాన్యత గురించి ప్రాచీన కాలం నుంచి చెప్పారు.

మంగళసూత్రం మత విశ్వాసం

శాస్త్రాల ప్రకారం వివాహం తర్వాత  శివ పార్వతులు వివాహిత జంటను రక్షిస్తారు. మంగళసూత్రాన్ని ఎక్కువ మంది పసుపు దారంతో తయారు చేస్తారు. మంగళసూత్రంలో పసుపు రంగు ఉండటం కూడా ముఖ్యం. నలుపు రంగు పూసలు పసుపు దారంలో వేయబడతాయి. నలుపు రంగు శనీశ్వరుడి చిహ్నమని చెబుతారు. అటువంటి పరిస్థితిలో  నల్ల పూసలు స్త్రీలను, వారి జీవిత భాగస్వాములను చెడు దృష్టి నుంచి రక్షిస్తాయి. పసుపు రంగు బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది. ఇది వివాహ బంధాన్ని దీర్ఘకాలం కొనసాగేలా చేయడంలో సహాయపడుతుంది. మంగళసూత్రంలోని పసుపు రంగు పార్వతి దేవిని సూచిస్తుంది, నలుపు పూసలు శివుని సూచిస్థాయి.

ఇవి కూడా చదవండి

హిందూ సంప్రదాయాల ప్రకారం మంగళసూత్రంలో 9 పూసలు ఉంటాయి. ఇవి 9 రకాల శక్తిని సూచిస్తాయి. ఈ శక్తులు భార్య, భర్తలను చెడు దృష్టి నుంచి రక్షిస్తాయి. ఈ పూసలు గాలి, నీరు, భూమి, అగ్ని వంటి మూలకాల శక్తిని కలిగి ఉన్నాయని కూడా అంటారు. ఇవి భార్య భర్తల మధ్య సంబంధాన్ని బలంగా ఉంచడంలో సహాయపడతాయి.

మంగళ దోషం నుండి ఉపశమనం కోసం మంగళసూత్రం

వివాహంలో వధువుకు మంగళసూత్రం ధరించడం వల్ల జాతకంలో మంగళ దోషం ఎలాంటి చెడు ప్రభావం చూపదు. మంగళసూత్రాన్ని ఎక్కువ మంది బంగారంతో తయారు చేసినవి మాత్రమే ధరిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో బంగారానికి బృహస్పతి గ్రహానికి సంబంధించింది. వైవాహిక జీవితంలో ఆనందానికి కారకుడిగా బృహస్పతి పరిగణించబడుతున్నాడు. అలాగే మంగళసూత్రంలో పొదిగిన నల్ల పూసలు శనీశ్వరుడికి  సంబంధించినవిగా పరిగణించబడతాయి. శనీశ్వరుడు స్థిరత్వానికి ప్రతీక. అందువల్ల మంగళసూత్రాన్ని ధరించడం ద్వారా శనీశ్వరు,  బృహస్పతిలు వైవాహిక జీవితంపై శుభ ప్రభావాన్ని చూపుతారు. జీవితంలో ఆనందం సాగుతుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు