AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమించి మోసం చేసి మరో అమ్మాయితో పెళ్లికి యువకుడు రెడీ.. యాసిడ్‌తో ప్రియురాలి దాడి!

పెళ్లి ఊరేగింపులో వరుడిపై యాసిడ్ పోయడంతో కలకలం రేగింది. ఈ ఘటన జరిగినప్పుడు కొందరు  మహిళలు పెళ్లికొడుకుతో పాటు తోడుగా ఉన్నారు. ఓ యువతి బురఖాతో పెళ్లి ఊరేగింపు దగ్గరకు చేరుకుని యాసిడ్ పోసింది. యాసిడ్‌ దాడిలో గాయపడిన వరుడిని, మహిళలను ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వరుడికి చికిత్స చేసి డిశ్చార్జి చేశారు. మళ్ళీ అర్థరాత్రి పెళ్లి ఊరేగింపుతో పెళ్లి చేసుకోవడానికి బయలుదేరాడు. ఐతే దాడిలో గాయపడిన ఇతర మహిళలకు చికిత్స కొనసాగుతోంది.

ప్రేమించి మోసం చేసి మరో అమ్మాయితో పెళ్లికి యువకుడు రెడీ.. యాసిడ్‌తో ప్రియురాలి దాడి!
Uttar Pradesh News
Surya Kala
|

Updated on: Apr 24, 2024 | 7:04 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది.  పెళ్లి ఊరేగింపుతో బయలుదేరిన వరుడిపై అతని ప్రియురాలు యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటనలో వరుడి చేయి కాలింది. అదే సమయంలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. యాసిడ్‌ విసిరి పారిపోతున్న యువతిని వరుడు స్నేహితులు పట్టుకున్నారు. యువతిని కొట్టారు కూడా.. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు.  నిందితురాలైన ప్రియురాలు తనను పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన ప్రియుడిపై కోపంతో పగ తీర్చుకోవాలని భావించింది.

పెళ్లి ఊరేగింపులో వరుడిపై యాసిడ్ పోయడంతో కలకలం రేగింది. ఈ ఘటన జరిగినప్పుడు కొందరు  మహిళలు పెళ్లికొడుకుతో పాటు తోడుగా ఉన్నారు. ఓ యువతి బురఖాతో పెళ్లి ఊరేగింపు దగ్గరకు చేరుకుని యాసిడ్ పోసింది. యాసిడ్‌ దాడిలో గాయపడిన వరుడిని, మహిళలను ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వరుడికి చికిత్స చేసి డిశ్చార్జి చేశారు. మళ్ళీ అర్థరాత్రి పెళ్లి ఊరేగింపుతో పెళ్లి చేసుకోవడానికి బయలుదేరాడు. ఐతే దాడిలో గాయపడిన ఇతర మహిళలకు చికిత్స కొనసాగుతోంది.

ముసుగు ధరించిన యువతి యాసిడ్‌ విసిరింది

ఇవి కూడా చదవండి

మొత్తం వ్యవహారం బల్లియాలోని బన్స్‌డిహరోడ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన దుమ్రీ గ్రామంలో జరిగింది. ఏప్రిల్ 23న గ్రామానికి చెందిన రాకేష్ బింద్ అనే యువకుడు ఊరేగింపుగా పెళ్లి చేసుకోవడానికి మౌ జిల్లాకు బయలు దేరడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంటి ఆడపడుచులు సంప్రదాయంగా పెళ్లి కొడుకుని రెడీ చేస్తున్నారు. ఇంతలో ఆ పెళ్లి బృందంలో అతిధుల మధ్య ముసుగు ధరించిన యువతి వచ్చింది. వరుడు రాకేష్ దగ్గరికి రాగానే నడుములోపల ఉన్న పాలిథిన్‌ని తీసి అందులో ఉన్న యాసిడ్‌ని అతనిపై పోసింది.

కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న బన్స్‌డీహరోడ్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితురాలైన యువతిని జనం పోలీసులకు అప్పగించారు. బాలికపై పోలీసులు కేసు నమోదు చేశారు.  విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. నిందితురాలు అదే గ్రామానికి చెందినదని స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరి మధ్య చాలా ఏళ్లుగా ప్రేమాయణం సాగిందని అంటున్నారు.

బాధితురాలితో ప్రేమ వ్యవహారం నడిపిన వరుడు

ఈ ఘటన గురించి అదనపు పోలీసు సూపరింటెండెంట్ అనిల్ కుమార్ ఝా మాట్లాడుతూ ఏప్రిల్ 23, సాయంత్రం 6 గంటలకు, రాకేష్ బింద్ ఊరేగింపు గ్రామం డుమ్రిలోని బెల్తారా రోడ్‌కు వెళ్లాల్సి ఉంది. వరుడితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు చెబుతున్న అదే గ్రామానికి చెందిన ఓ యువతి పాలిథిన్‌ కవర్ లో  లిక్విడ్‌ను తీసుకెళ్లి అతడిపై విసిరింది. వరుడికి ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం ఇంటికి పంపించారు. అనంతరం వరుడు కుటుంబ సభ్యులు పెళ్లి ఊరేగింపుతో పెళ్లి చేయడానికి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..