కృషి పట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి.. చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్ .. వీడియో వైరల్

ఈ విషయాన్నీ ఎప్పుడైనా ఆలోచించి ఉంటారా.. మారియట్ కి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆ యువతి తన పాదాలతో కారు నడుపుతున్నట్లు కనిపిస్తుంది. తన రెండు కాళ్లను బాగా ఉపయోగించి కారు నడపడం నేర్చుకుంది. కాళ్లతో కారు గేర్ కూడా మారుస్తుంది. ఈ వీడియో జిలుమోల్‌ మారిట్‌ థామస్ అనే ఐడితో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 6.8 మిలియన్ సార్లు వ్యూస్ ను సొంతం చేసుకుంది.

కృషి పట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి.. చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్ .. వీడియో వైరల్
Jilumol Mariet Thomas
Follow us
Surya Kala

|

Updated on: Apr 24, 2024 | 6:17 PM

శరీరంలోని ప్రతి భాగం మానవులకు ముఖ్యమైనది. కళ్లు, కాళ్లు, చేతులు ఇలా ఏ అవయవం లేక పోయినా  చాలా ఇబ్బంది పడతారు. ప్రమాదం వల్లనో, ఏదైనా వ్యాధి వల్లనో కొందరు శరీరంలోని కొన్ని భాగాలను  కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ధైర్యం కోల్పోకుండా మరింత స్ఫూర్తితో జీవితాన్ని కొనసాగిస్తారు.  ముందు లాగానే తమ జీవితం సాగేలా కృషి, పట్టుదలతో జీవితంలో ముందుకు వెళ్తారు. అలాంటి ఒక అమ్మాయి ఈ రోజుల్లో వార్తల్లో ఉంది. ఆ యువతికి రెండు చేతుల్లేవు..అయితే తనను చూసి ప్రపంచమే  ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

ఈ అమ్మాయి పేరు జిలుమోల్ మారియెట్ థామస్. ఆమె కేరళ నివాసి. మరియెట్ చేతులు లేకపోయినా కారు నడపగలదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీని కోసం ఆమె తన పాదాలను ఉపయోగిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా సొంతం చేసుకుంది. ఎవరైనా తన పాదాలతో కారు నడపగలరని కారు నడపడానికి వీలుగా ప్రభుత్వం అందించే డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉంది. ఈ విషయాన్నీ ఎప్పుడైనా ఆలోచించి ఉంటారా.. మారియట్ కి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆ యువతి తన పాదాలతో కారు నడుపుతున్నట్లు కనిపిస్తుంది. తన రెండు కాళ్లను బాగా ఉపయోగించి కారు నడపడం నేర్చుకుంది. కాళ్లతో కారు గేర్ కూడా మారుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఈ వీడియో జిలుమోల్‌ మారిట్‌ థామస్ అనే ఐడితో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 6.8 మిలియన్ సార్లు వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు 2.5 లక్షల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. వివిధ కామెంట్‌లు కూడా ఇచ్చారు. ఒకరు ‘మీరు నిజంగా స్ఫూర్తిదాయకం’ అని రాస్తే, మరొక వినియోగదారు ‘ఇది భారతదేశంలో మాత్రమే చూడవచ్చు’ అని రాశారు.

నివేదికల ప్రకారం మారియాట్‌కు చిన్నప్పటి నుంచి రెండు చేతులు లేవు. కనుక ఆమె తన పాదాలతో అన్ని పనులను నేర్చుకుంది. ఆమె తన పాదాలతో రాస్తుంది. పెయింటింగ్స్ కూడా వేస్తుంది. ఆమె అద్భుతమైన సామర్థ్యం కారణంగా.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఎందరో సెలబ్రిటీలు కూడా ఆ యువతిని కలుస్తారు. ప్రస్తుతం ఆమె సెలబ్రిటీకి ఏమాత్రం తక్కువేమీ కాదు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..