24 గంటల్లో 80కి పైగా భూకంపాలు.. తూర్పు తీరంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు

24 గంటల్లో 80కి పైగా భూకంపాలు.. తూర్పు తీరంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు

Phani CH

|

Updated on: Apr 24, 2024 | 5:35 PM

తైవాన్ మరోసారి తీవ్ర భూకంపాలతో వణికిపోయింది. తైవాన్ తూర్పు తీరంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 24 గంటల వ్యవధిలో ఏకంగా 80 భూకంపాలు సంభవించాయి. వీటి తీవ్రత 6.3గా నమోదయింది. ఈ ప్రభావంతో దేశ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బతిన్నాయని తైవాన్ వాతావరణ విభాగం తెలిపింది. దేశం తూర్పు ప్రాంతంలోని హువాలియన్‌లో ఎక్కువ భూకంప కేంద్రాలను గుర్తించినట్టు వెల్లడించింది.

తైవాన్ మరోసారి తీవ్ర భూకంపాలతో వణికిపోయింది. తైవాన్ తూర్పు తీరంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 24 గంటల వ్యవధిలో ఏకంగా 80 భూకంపాలు సంభవించాయి. వీటి తీవ్రత 6.3గా నమోదయింది. ఈ ప్రభావంతో దేశ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బతిన్నాయని తైవాన్ వాతావరణ విభాగం తెలిపింది. దేశం తూర్పు ప్రాంతంలోని హువాలియన్‌లో ఎక్కువ భూకంప కేంద్రాలను గుర్తించినట్టు వెల్లడించింది. అయితే ఈసారి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఏప్రిల్ 3న తైవాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విపత్తులో 14 మంది మరణించారు. అప్పటి నుంచి తైవాన్ వరుస భూప్రకంపనలు చవిచూస్తోంది. ఏప్రిల్ 3న సంభవించిన భూకంపంతో హువాలియన్‌లో ఓ పక్కకు ఒరిగిపోయిన ఓ హోటల్ తాజా భూకంపం ప్రభావంతో మరింతగా దెబ్బతిందని అగ్నిమాపక విభాగం మంగళవారం తెల్లవారుజామున వివరించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. ఏంది మావా ఇది

మానేరు వాగుపై 2016లో ప్రారంభమైన వంతెన నిర్మాణం.. అప్పుడే కుప్పకూలిందిగా