Vasuki Snake: గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము..! ఇది పురాణాల్లో చెప్పిన వాసుకీనా?

వాసుకి పేరు చెప్పగానే క్షీరసాగర మథనం గుర్తుకు వస్తుంది. అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడానికి దేవతలు, రాక్షసులు సిద్ధమయ్యారు. కవ్వంగా మంధగిరిని, తాడుగా వాసుకిని ఉపయోగించారు. వాసుకి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ చిత్రం కళ్లముందు కదులుతుంది. ఇంతకీ పురాణాల్లో చెప్పుకునే ఆ పాము భూమిపై సంచరించిందా? మరి.. గుజరాత్ లో శాస్త్రవేత్తలకు లభించిన ఆ పాము శిలాజాలకు, దానికి సంబంధమేంటి?

Vasuki Snake: గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము..! ఇది పురాణాల్లో చెప్పిన వాసుకీనా?

|

Updated on: Apr 24, 2024 | 11:21 AM

వాసుకి పేరు చెప్పగానే క్షీరసాగర మథనం గుర్తుకు వస్తుంది. అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడానికి దేవతలు, రాక్షసులు సిద్ధమయ్యారు. కవ్వంగా మంధగిరిని, తాడుగా వాసుకిని ఉపయోగించారు. వాసుకి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ చిత్రం కళ్లముందు కదులుతుంది. ఇంతకీ పురాణాల్లో చెప్పుకునే ఆ పాము భూమిపై సంచరించిందా? మరి.. గుజరాత్ లో శాస్త్రవేత్తలకు లభించిన ఆ పాము శిలాజాలకు, దానికి సంబంధమేంటి? అసలు దానికి వాసుకి అన్న పేరు ఎందుకు పెట్టారు? దానిని వాసుకీ ఇండికస్ అని ఎందుకు పిలుస్తున్నారు?

4.7 కోట్ల ఏళ్లు, 1000 కేజీల బరువు, 50 అడుగుల పొడవు.. ఇది గుజరాత్ లో శాస్త్రవేత్తలకు లభించిన అతిపెద్ద పాముకు సంబంధించిన శిలాజాలు చెప్పే కథ. ఇంత పెద్ద పామా అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. ఆ కాలంలో ఇంత భారీ సైజున్న పాములు సంచరించేవి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ కాలానికి అనకొండ ఎలానో.. ఆ కాలానికి ఆ జీవి అలా ఉండేది. ఇది ఇంత భారీగా ఉండబట్టే దీనికి వాసుకి అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ పేరుకు ఉన్న పౌరాణిక ప్రాశస్త్యం వల్ల అందరి దృష్టీ ఇప్పుడు దీనిపై పడింది.

ఈ పాము విషయం ఇప్పుడు బయటకు వచ్చి ఉండవచ్చు. కాని దీని శిలాజాలు మాత్రం గుజరాత్ లోని ఓ బొగ్గు గనిలో ప్రొఫెసర్ సునీల్ వాజ్ పేయికి 2005లోనే లభ్యమయ్యాయి. అప్పట్లో దానిపై పరిశోధనలు చేశారు. అవన్నీ పెద్ద ఆకారంలో ఉన్న మొసలికి చెందినవిగా భావించారు. తరువాత వేరే వాటికోసం పరిశోధనలు చేపట్టడంతో ఈ పాముకు సంబంధించిన పరిశోధనకు బ్రేక్ పడింది. అప్పటి నుంచి ఆ ఆధారాలు అన్నీ ల్యాబ్ లోనే ఉండిపోయాయి. కానీ ఆ తరువాత రూర్కీ ఐఐటీ శాస్త్రవేత్తలు దీనిపై ఫోకస్ పెట్టారు. అలా దేబ్ జీత్ దత్తా అనే సైంటిస్ట్ దీని గురించి పరిశోధన చేపట్టారు. తమకు గనిలో లభించిన 27 వెన్నుపూసలను పరీక్షించారు. వాటిని ఓ ఆర్డర్ లో పేర్చి చూస్తే.. వారికి క్లియర్ గా ఓ పిక్చర్ కనిపించింది. వీటిలో కొన్ని ఒకదానికి మరొకటి లింక్ అయి ఉన్నాయి. దీంతో వివిధ రకాల జంతువుల వెన్నుపూసల నిర్మాణంతో ఈ శిలాజం తాలూకా ఎముకలను కంపేర్ చేసి చూశారు.

నిజానికి ఇంత పెద్ద జీవి వెన్నుపూసలు లభించడంతో శాస్త్రవేత్తలు వీటిపై జాగ్రత్తగా పరిశోధనలు చేశారు. చివరకు ఇవి పెద్ద పామువే అని అంచనాకు వచ్చారు. అలా కిందటి సంవత్సరంలోనే ఓ నిర్ణయానికి వచ్చినా.. మళ్లీ దానిపై పరిశోధనలు చేసి ఇప్పుడు దానిని నిర్థారించారు. నిజానికి ఇది 4 కోట్ల 70 లక్షల సంవత్సరాల కిందటిది. ఆ కాలంలో దాని ఆకారం ఎలా ఉండేదో, దాని ఆహారం ఏమిటో, అప్పటి వాతావరణం బట్టి అది జీవించిన విధానం ఏమిటో.. ఇలా అన్ని విషయాలపైనా శాస్త్రవేత్తలు అవగాహనకు వచ్చారు. ఒక పాము ఇంత భారీ ఆకారంలో ఉందీ అంటే.. దానికి తగ్గ ఆహారం ఆ కాలంలో లభించి ఉండాలి. అదే క్రమంలో దానికి శత్రు భయం కూడా తక్కువగా ఉండి ఉండాలి. ఆ కాలంలో అది తీరానికి సమీపంలో ఉండే చిత్తడి నేలల్లో నివసించేదని భావిస్తున్నారు. అందుకే మొసళ్లు, తాబేళ్లు, చేపలు వంటి వాటిని ఆహారంగా తీసుకుని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

భారీ ఆకారం వల్ల నెమ్మదిగా కదిలినా.. దొరికిన జంతువులను మాత్రం గట్టిగా చుట్టేసి ఆహారంగా తీసుకునేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 62 నుంచి 111 మిల్లీమీటర్ల వెడల్పు ఉండేదని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆధారాలను బట్టి చూస్తే.. మన దేశంతోపాటు ఆఫ్రికా, యూరప్ లోనూ ఈ జాతి విస్తరించిందని తెలుస్తోంది. అప్పట్లో అంతరించిపోయిన టిటనోబోవా పాము జాతి కంటే ఇది పెద్దదన్నది శాస్త్రవేత్తల అంచనా. ఈ టిటనోబోవా జాతి పాములు.. ఆకారంలో చాలా పెద్దగా ఉంటాయి. 2000 సంవత్సరంలో కొలంబియాలో కనుగొన్నారు. ఇప్పుడు వాసుకి శిలాజాలు బయటపడడంతో.. దీనినే పెద్ద జీవిగా తేల్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us