ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. స్మగ్లింగ్ చేయటానికి ఇంకేం దొరకలేదారా ??

ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. స్మగ్లింగ్ చేయటానికి ఇంకేం దొరకలేదారా ??

Phani CH

|

Updated on: Apr 24, 2024 | 5:38 PM

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్‌ సంఘటన చోటుచేసుకుంది. అనకొండలను స్మగ్లింగ్ చేయబోతూ ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 10 అనకొండలను వెంటపెట్టుకొని ప్రయాణిస్తున్నాడు అ ప్యాసింజర్‌. అయితే చెకింగ్‌ దగ్గర అతని అనకొండల గుట్టు రట్టవడంతో కటకటాల్లోకి వెళ్లాడు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో దిగాడు.

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్‌ సంఘటన చోటుచేసుకుంది. అనకొండలను స్మగ్లింగ్ చేయబోతూ ఓ ప్రయాణికుడు కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 10 అనకొండలను వెంటపెట్టుకొని ప్రయాణిస్తున్నాడు అ ప్యాసింజర్‌. అయితే చెకింగ్‌ దగ్గర అతని అనకొండల గుట్టు రట్టవడంతో కటకటాల్లోకి వెళ్లాడు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో దిగాడు. ఈ క్రమంలో అతని బ్యాగేజీని చెక్‌చేశారు ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది. అందులో ఏకంగా 10 పసుపు రంగు అనకొండలు బయటపడ్డాయి. ఓ సూట్ కేసులో తెల్ల కవర్లలో చుట్టి అనకొండలను తరలిస్తున్నట్టు గుర్తించారు. దీంతో నిందితుడిని అరెస్టు చేశామని.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని కస్టమ్స్ అధికారులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటనలో స్వాధీనం చేసుకున్న అనకొండల ఫొటోలను షేర్ చేశారు. వన్యప్రాణుల స్మగ్లింగ్ ను ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. భారతీయ చట్టాల ప్రకారం వన్యప్రాణులతో వ్యాపారం చేయడం చట్ట విరుద్ధం. తాజా ఘటన సోషల్ మీడియాను షేక్ చేసింది. బ్యాంకాక్ ప్రయాణికుడి చర్యను చాలా మంది నెటిజన్లు తప్పుబట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

24 గంటల్లో 80కి పైగా భూకంపాలు.. తూర్పు తీరంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు

మొన్న ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. ఏంది మావా ఇది

మానేరు వాగుపై 2016లో ప్రారంభమైన వంతెన నిర్మాణం.. అప్పుడే కుప్పకూలిందిగా