Barrelakka: మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తన వైపుకు తిప్పుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువత ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రముఖులు తనకు సపోర్టు ఇచ్చారంటే బర్రెలక్కకు ఉన్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తన వైపుకు తిప్పుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువత ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రముఖులు తనకు సపోర్టు ఇచ్చారంటే బర్రెలక్కకు ఉన్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి బర్రెలక్కె మరో సారి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఈ సారి ఏకంగా లోక్ సభ బరిలో కూడా పోటీకి దిగుతోంది.
తన స్నేహితుడు, సమీప బంధువు వెంకటేశ్‌తో పెళ్లిపీటలెక్కిన బర్రెలక్క.. ఇక ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉండిపోతుందిని అనుకున్నారు అందరూ..! కానీ దీనికి భిన్నంగా ముందు చెప్పినట్టుగానే లోక్ సభ ఎన్నికల బరిలో దిగింది. ఇక రీసెంట్‌గా నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసింది శిరీష. ఎలాంటి హడావుడి, లేకుండా.. కేవలం తన భర్త, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించింది. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!