పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మృతి చెందిన మేనమామ..

సంతోషంగా నిండిపోయిన పెళ్లి వేదిక ఒక్కసారిగా శోకసంద్రంగా మారింది. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఆర్తనాదాలు, కేకలతో నిండిపోయింది. ఈ దారుణ ఘటన నవాల్‌ఘర్ ప్రాంతానికి చెందిన లోచ్వాలో చోటు చేసుకుంది. మృతుడు నవాల్‌ఘర్‌లోని చౌకని గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తూ ఇంటింటికీ గ్యాస్ సిలిండర్‌లను పంపిణీ చేస్తున్నారు. తమ మేనకోడలు, మేనల్లుడి పెళ్లితో అందంగా సంతోషంగా ఉన్నామని.. ఇంతలో ఇలా జరిగిందని మృతుడు సోదరుడు ఇంద్రజ్ ధాకా చెప్పాడు. 

పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మృతి చెందిన మేనమామ..
Uncle Died While Dancing
Follow us
Surya Kala

|

Updated on: Apr 24, 2024 | 2:54 PM

మేనల్లుడి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మేనమామ హఠాన్మరణం చెందడంతో రాజస్థాన్‌లో కలకలం రేగింది. మేనమామ పెళ్లి వేడుకల్లో సంతోషంగా తలపై కుండ పెట్టుకుని జోరుగా డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

సంతోషంగా నిండిపోయిన పెళ్లి వేదిక ఒక్కసారిగా శోకసంద్రంగా మారింది. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఆర్తనాదాలు, కేకలతో నిండిపోయింది. ఈ దారుణ ఘటన నవాల్‌ఘర్ ప్రాంతానికి చెందిన లోచ్వాలో చోటు చేసుకుంది. మృతుడు నవాల్‌ఘర్‌లోని చౌకని గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తూ ఇంటింటికీ గ్యాస్ సిలిండర్‌లను పంపిణీ చేస్తున్నారు. తమ మేనకోడలు, మేనల్లుడి పెళ్లితో ఆనందంగా, సంతోషంగా ఉన్నామని.. ఇంతలో ఇలా జరిగిందని మృతుడు సోదరుడు ఇంద్రజ్ ధాకా చెప్పాడు.

మేనల్లుడు, మేనకోడళ్ల పెళ్లి వేడుకల సందడి

మృతుడి పేరు కమలేష్ తన మేనల్లుడు, మేనకోడలు పెళ్లికి వెళ్లాడు. మేనకోడలు దీపిక వివాహం ఏప్రిల్ 19న జరిగింది. మేనల్లుడు పంకజ్ వివాహం ఏప్రిల్ 21న జరిగింది. కమలేష్ తన సోదరుడు ఇంద్రజ్ ధాకా, ఇతర  కుటుంబ సభ్యులతో కలిసి ఏప్రిల్ 20న ఛోటా భాట్‌ను పూరించడానికి లోచ్వాలోని ధానికి వెళ్లారు. ఈ సమయంలో అతను కుండని బియ్యంతో  నింపాడు. ఆ తర్వాత పూజ చేసి ఆ కుండని తలపై పెట్టుకుని  ఉల్లాసంగా నృత్యం చేస్తున్నాడు. ఈ సమయంలో గుండెపోటు రావడంతో కమలేష్ కిందపడిపోయాడు. దీంతో కమలేష్‌ను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పెళ్లికి అన్నం వడ్డించేందుకు వచ్చిన మేనమామ హఠాన్మరణం చెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఇల్లంతా విషాద ఛాయలు అలముకున్నాయి. అంత్యక్రియలు అనంతరం మేనల్లుడి పెళ్లిని సాదాసీదాగా జరిపించారు.

ఇవి కూడా చదవండి

డ్యాన్స్ చేస్తున్నప్పుడు గుండెపోటు

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కమలేష్ డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయి మళ్లీ లేవలేకపోయాడు. మరణించిన వ్యక్తి చాలా సంతోషంగా ఉండేవాడని, అతను డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఎప్పుడూ నవ్వుతు ఉండేవాడని స్నేహితులు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..