అమ్మమ్మ కాలం నాటి చిట్కా.. ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన నల్లని జుట్టు మీ సొంతం..

జుట్టు ఎదుగుదల కోసం  మృదువుగా ఉండేందుకు కొందరు రకరకాల ట్రీట్ మెంట్లు చేయించుకుంటున్నారు. ఖరీదైన ఉత్పత్తులను వాడుతున్నారు. అయినప్పటికీ జుట్టు రాలే విషయంలో పెద్దగా తేడా కనిపించదు. అయితే కొందరు తమ జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు అమ్మమ్మల కాలం నాటి ఇంటి నివారణలను పాటిస్తారు. ఇందులో ఉల్లిపాయ జుట్టు పెరుగుదలకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఉల్లిపాయలో కొన్ని పదార్థాలను మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేస్తే, అది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

అమ్మమ్మ కాలం నాటి చిట్కా.. ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన నల్లని జుట్టు మీ సొంతం..
Hair Care Tips
Follow us
Surya Kala

|

Updated on: Apr 24, 2024 | 6:41 PM

రోజు రోజుకీ పెరుగుతున్న ఒత్తిడి, మారుతున్న జీవనశైలి, కాలుష్యం కారణంగా అనేక రకాల సమస్యలు పెరుగుతున్నాయి. వీటిల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. ఇది చాలా సాధారణ సమస్యగా మారింది కూడా. వాతావరణ కాలుష్యం వలన, పోషకాహార లోపం వలన జుట్టు పాడవడం ప్రారంభమవుతుంది. శరీరంలో ఏ రకమైన విటమిన్ లోపం వల్ల, జుట్టు బలహీనంగా మారుతుంది. రాలడం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జుట్టు ఎదుగుదల కోసం  మృదువుగా ఉండేందుకు కొందరు రకరకాల ట్రీట్ మెంట్లు చేయించుకుంటున్నారు. ఖరీదైన ఉత్పత్తులను వాడుతున్నారు. అయినప్పటికీ జుట్టు రాలే విషయంలో పెద్దగా తేడా కనిపించదు.

అయితే కొందరు తమ జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు అమ్మమ్మల కాలం నాటి ఇంటి నివారణలను పాటిస్తారు. ఇందులో ఉల్లిపాయ జుట్టు పెరుగుదలకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఉల్లిపాయలో కొన్ని పదార్థాలను మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేస్తే, అది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

ఉల్లిపాయ, తేనె:

జుట్టు పొడవుగా, మృదువుగా ఉండాలంటే ఉల్లిపాయ రసాన్ని తేనెతో కలిపి రాసుకోవచ్చు. దీని కోసం మీరు 2 టీస్పూన్ల ఉల్లిపాయ రసంలో 1 టీస్పూన్ తేనె మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. తర్వాత 10 నుంచి 15 నిమిషాల తర్వాత జుట్టును షాంపూతో వాష్ చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయవచ్చు. కొంత సమయం ఉపయోగించిన తర్వాత ఈ చిట్కా ప్రభావం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మెంతి పొడి, ఉల్లిపాయ రసం:

మెంతి గింజలు, ఉల్లిపాయ రసం రెండూ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఇందుకోసం మీరు మార్కెట్‌లో మెంతిపొడిని కొనుగోలు చేయవచ్చు లేదా ఇంట్లోనే మెంతి గింజలను గ్రైండ్ చేసి అందులో ఉల్లిపాయ రసం కలిపి తలకు రాసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత షాంపూ చేసుకోవాలి.

ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనె:

ఉల్లిపాయ రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి అప్లై చేయడం వల్ల కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ జుట్టును మృదువుగా చేయడంలో, చుండ్రును వదిలించుకోవడంలో, తెల్ల జుట్టు సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఉల్లిపాయలు.. ఇవన్నీ కలిపినప్పటికీ జుట్టు పెరుగుదల అనేది సహజమైన ప్రక్రియ. అయితే కొందరికి కొన్నిసార్లు ఇటువంటి చిట్కాలు కూడా అలెర్జీని కలిగి ఉండవచ్చు. కనుక దీనిని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయించుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)