Love Brain Disorder: ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! ‘లవేరియా’ జలుబు, దగ్గు కాదు, ఇదోరకం రోగం..! వింత వ్యాధి గురించి విని వైద్యులే షాక్‌..!

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆమె నుండి తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందంటున్నాడు జియాయు ప్రియుడు. వారి ప్రేమ ఒక సంవత్సరం క్రితం యూనివర్సిటీలో మొదలైందని చెప్పాడు. అయితే జియాయు తనపై అంతగా ప్రేమను పెంచుకున్నట్టుగా తనకు తెలియదని చెప్పాడు.. అతను బిజీగా ఉన్నందున ఫోన్‌కి సమాధానం ఇవ్వలేకపోయానని చెప్పాడు. కాబట్టి, మీలో ఎవరైనా ఇలాంటి లక్షణాలను ఎదుర్కొంటున్నట్టయితే, సంబంధిత వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

Love Brain Disorder: ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! 'లవేరియా' జలుబు, దగ్గు కాదు, ఇదోరకం రోగం..! వింత వ్యాధి గురించి విని వైద్యులే షాక్‌..!
Love Brain Disorder
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 25, 2024 | 5:04 PM

తినే తిండి, చేసే పని ఏదైనా సరే.. అతిగా చేయడం ప్రమాదకరమని మన పెద్దలు తరచూగా చెబుతూనే ఉంటారు. ప్రేమ విషయంలో కూడా అదే జరుగుతుంది. సంబంధాలలో ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతుంటారు. కానీ, అలాంటి అతి ప్రేమ కూడా అనార్థమే అని నిరూపించే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక అమ్మాయి ఇలాగే తన బాయ్‌ఫ్రెండ్‌పై ఎనలేని ప్రేమను పెంచుకుంది. అతడిపై ఉన్న పిచ్చి ప్రేమతో ఆమె ఎలా మారిపోయిందంటే..చివరకు ఆమె ఓ వింత వ్యాధికి బలైపోయింది. ప్రియుడు తనకు ఫోన్ చేయకపోవడంతో ఆ అమ్మాయి వింత వ్యాధికి గురైంది. హఠాత్తుగా విధ్వంసం చేయడం ప్రారంభించింది. ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. ఆమె పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం ఏంటంటే..

చైనాలోని ఓ యువతికి ప్రేమ జబ్బు వచ్చింది. హా.. ఇదేం మాయరోగం అనుకుంటున్నారా..? కానీ, ఇది నిజంగానే వింత వ్యాధి. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన జియావు అనే 18 ఏళ్ల యువతి లవ్‌ బ్రెయిన్‌ డిజార్డర్‌ బారినపడింది.. ఈ వ్యాధితో బాధపడుతున్న యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కి ఒక్క రోజులో వందసార్లు ఫోన్‌ చేసిందట. కానీ అతడు బిజీగా ఉండటం వల్ల ఆమె కాల్‌ లిఫ్ట్‌ చేయలేకపోయాడు. కానీ, ఆ అమ్మాయి మాత్రం అతనికి కాల్స్‌, మెసేజేస్‌ చేస్తూనే ఉంది. మెసేజ్‌ల మీద మెసేజ్‌లు చేసింది. దాదాపు 100 కాల్స్ చేసింది. కానీ, అతని నుండి ఎలాంటి రిప్లై రాలేదు. బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడలేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తూ.. ఇంట్లోని వస్తువులను విసిరేయడం ప్రారంభించింది. కిటికీలో నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. చివరకు కుటుంబీకులు చేసేది లేక పోలీసులను పిలిచి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన జియావు అనే 18 ఏళ్ల యువతి లవ్‌ బ్రేయిన్‌ డిజార్డర్‌తో బాధపడుతోంది. ఈ వ్యాధి లక్షణాలు బాయ్‌ ఫ్రెండ్‌ అంటే పిచ్చి ప్రేమ. దాంతో ఆమె కారణంగా నిజంగానే ఆమె పిచ్చిది అయిపోయిందని, మానసిక రుగ్మతతో బాధపడుతోందని వైద్యులు గుర్తించారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆమె నుండి తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందంటున్నాడు జియాయు ప్రియుడు. వారి ప్రేమ ఒక సంవత్సరం క్రితం యూనివర్సిటీలో మొదలైందని చెప్పాడు. అయితే జియాయు తనపై అంతగా ప్రేమను పెంచుకున్నట్టుగా తనకు తెలియదని చెప్పాడు.. అతను బిజీగా ఉన్నందున ఫోన్‌కి సమాధానం ఇవ్వలేకపోయానని అన్నాడు..

ఇవి కూడా చదవండి

మీడియా నివేదికల ప్రకారం, లవ్ బ్రెయిన్ అనేది వైద్య పదం కాదు, కానీ, ఇది లవ్ బ్రెయిన్ డిజార్డర్. దీనిలో ఆ వ్యక్తి ప్రేమికుడి పట్ల పిచ్చివాడిలా మారిపోతాడు. చిన్న విషయాలకే ఆందోళన చెందుతారని వైద్యులు వెల్లడించారు. వాస్తవానికి, ఇది సంబంధానికి సంబంధించిన ఒక రకమైన అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్. ఇది మీకు సంబంధం గురించి సందేహాస్పదంగా మారినప్పుడు, విశ్రాంతి లేకపోవడం వల్ల పిచ్చివారిలా ప్రవర్తించడం మొదలుపెడతారు. ఇది ఒక మానసిక వ్యాధి. ఇందులో ఆవేశం, దూకుడుగా వ్యవహరించే తత్త్వం, మనస్సులో నిరంతరం ఆందోళన వస్తాయి. ఇలాంటి వారు తమను తాము నియంత్రించుకోలేరు. తమకు తామే హాని కలిగించుకుంటారు. కాబట్టి, మీలో ఎవరైనా ఇలాంటి లక్షణాలను ఎదుర్కొంటున్నట్టయితే, సంబంధిత వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..