AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడి..

జూన్ 1 తర్వాత సైనిక అధికారులు లేదా ఉద్యోగులు ఆర్మీ భవనంలోకి ఐఫోన్లను తీసుకుని వెళ్లలేరు. దేశం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 5 లక్షల మంది ప్రజలు నష్టపోనున్నారు. ఆపిల్ కంపెనీ డిఫెన్స్ మొబైల్ సెక్యూరిటీ యాప్ షరతులకు అనుగుణంగా లేదని చెబుతున్నారు. దేశంలోని ఈ యాప్ పరికరం కెమెరా, Wi-Fi, మైక్రోఫోన్‌ను బ్లాక్ చేస్తుంది. అయితే ఆపిల్ ఫోన్ నిర్మాణంలోని భద్రత దీనిని అనుమతించదు.

ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడి..
South Korea Country Banned Iphone
Surya Kala
|

Updated on: Apr 25, 2024 | 5:11 PM

Share

స్మార్ట్ ఫోన్లలో ఐఫోన్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ కొత్త మోడల్ మార్కెట్ లోకి వచ్చినా లక్షల ధర అయినా సరే హాట్ కేక్ లా అమ్ముడుపోతాయి ఐఫోన్స్.. అయితే ఈ ఐఫోన్స్ పై దక్షిణ కొరియా  నిషేధం విధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ దేశం సైనిక భవనాల్లో ఐఫోన్లను నిషేధిస్తోంది. అయితే వీరు Samsung Android పరికరాలను ఉపయోగించవచ్చు. యాప్ నుంచి రికార్డ్ చేయగల లేదా నియంత్రించగల పరికరాలపై ఈ నిషేధం విధిస్తున్నట్లు దక్షిణ కొరియా తెలిపింది. ఈ ఉత్తర్వులు జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

జూన్ 1 తర్వాత సైనిక అధికారులు లేదా ఉద్యోగులు ఆర్మీ భవనంలోకి ఐఫోన్లను తీసుకుని వెళ్లలేరు. దేశం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 5 లక్షల మంది ప్రజలు నష్టపోనున్నారు. ఆపిల్ కంపెనీ డిఫెన్స్ మొబైల్ సెక్యూరిటీ యాప్ షరతులకు అనుగుణంగా లేదని చెబుతున్నారు. దేశంలోని ఈ యాప్ పరికరం కెమెరా, Wi-Fi, మైక్రోఫోన్‌ను బ్లాక్ చేస్తుంది. అయితే ఆపిల్ ఫోన్ నిర్మాణంలోని భద్రత దీనిని అనుమతించదు.

భద్రత విషయంలో కీలక నిర్ణయం

ద కొరియా హెరాల్డ్ నివేదిక ప్రకారం దక్షిణ చుంగ్‌చియోంగ్ ప్రావిన్స్‌లోని గైయోంగ్‌డేలో ఆర్మీ, నేవీ, వైమానిక దళం ప్రధాన కార్యాలయం నిర్వహించిన సంయుక్త సమావేశాల్లో మిలిటరీలో ఐఫోన్‌లను నిషేధించే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దేశంలోని మిలిటరీ ప్రదేశాల్లో iPhone నిషేధంపై మాట్లాడుతూ భద్రత గురించి  ఆందోళనల వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ నిర్ణయం వెనుక దేశీయ బ్రాండ్స్ కు ప్రాధ్యానత

దక్షిణ కొరియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జాతీయవాద ఉద్దేశ్యాలున్నట్లు తెలుస్తోంది. దేశీయ బ్రాండ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. iPhoneలను నిషేధించినప్పటికీ Samsung  కంపెనీ తయారు చేస్తున్న Android ఆధారిత సెల్ ఫోన్లకు నిషేధం  మినహాయింపు ఇచ్చారు.

యాపిల్ వాచ్‌పై కూడా నిషేధం

ఐఫోన్‌లతో పాటు, యాపిల్ వాచ్ వంటి ధరించగలిగే పరికరాలపై కూడా నిషేధం వర్తిస్తుందని చెప్పారు. ఐఫోన్ కంటే గృహోపకరణాలకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక లాజిక్ ఇంకా స్పష్టం చేయలేదు. అదనంగా  మైక్రోఫోన్ వినియోగాన్ని నిరోధించడంలో దక్షిణ కొరియా నేషనల్ డిఫెన్స్ మొబైల్ సెక్యూరిటీ MDM యాప్  ప్రభావం గురించి కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వినియోగదారుల నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చే పరిస్థితులకు దారి తీస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..