Bigg Boss 4: ఆ సాయానికి చాలా గర్వంగా అనిపించింది

సమాజం కోసం వేరే వాళ్ల జీవితంలో వెలుగులు నింపిన సంఘటనలు చెప్పాలంటూ బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు చెప్పగా.. తన స్నేహితుడికి చేసిన సాయం గురించి సొహైల్ తెలిపారు

Bigg Boss 4: ఆ సాయానికి చాలా గర్వంగా అనిపించింది
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 06, 2020 | 7:43 AM

Bigg Boss 4 Sohail: సమాజం కోసం వేరే వాళ్ల జీవితంలో వెలుగులు నింపిన సంఘటనలు చెప్పాలంటూ బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు చెప్పగా.. తన స్నేహితుడికి చేసిన సాయం గురించి సొహైల్ తెలిపారు. ”నా స్నేహితుడి భార్య‌కు అప్ప‌టికే రెండుసార్లు గ‌ర్భ‌స్రావం అయ్యింది. మూడోసారి గ‌ర్భం దాల్చినప్పుడు ఓ రోజు అర్ధరాత్రి నాకు వాడు ఫోన్ చేశాడు. అర్జంట్‌గా డబ్బులు కావాలన్నాడు. ఆ సమయంలో నా దగ్గర డబ్బులు లేవు. మా వాళ్లని అడిగి రూ.15వేలు ఇచ్చా. కానీ ఆ తరువాతి రోజు 10 లక్షలు అవుతుందని వాడు చెప్పాడు. దీంతో సోష‌ల్ మీడియాలో సాయం కోరా. ఓ పోస్టు పెట్టి 10 ల‌క్ష‌లు స‌మ‌కూర్చా. వాడు చాలా ఎమోష‌నల్ అయ్యాడు. జీవితాంతం నీకు, స‌మాజానికి రుణ‌ప‌డి ఉంటాన‌ని నాతో అన్నాడు. దాంతో నాకు చాలా గర్వంగా అనిపించింది అని చెప్పుకొచ్చాడు నాకు కూడా గ‌ర్వంగా అనిపించింది” అని చెప్పుకొచ్చాడు.

Read More:

Bigg Boss 4: సీక్రెట్‌ పెళ్లి చేసుకున్నా.. మొదటి బిడ్డను చంపేసుకున్నా

Bigg Boss 4: సీక్రెట్ టాస్క్‌లో గెలిచిన హారిక.. కెప్టెన్సీ రేస్‌లో ఆ ముగ్గురు