Bigg Boss 4: సీక్రెట్‌ పెళ్లి చేసుకున్నా.. మొదటి బిడ్డను చంపేసుకున్నా

గురువారం ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. సమాజం కోసం వేరే వాళ్ల జీవితంలో వెలుగులు నింపిన సంఘటనలు ఇంటి సభ్యులతో పంచుకోవాలని బిగ్‌బాస్‌ చెప్పాడు

Bigg Boss 4: సీక్రెట్‌ పెళ్లి చేసుకున్నా.. మొదటి బిడ్డను చంపేసుకున్నా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 06, 2020 | 7:27 AM

Bigg Boss 4 Lasya: గురువారం ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. సమాజం కోసం వేరే వాళ్ల జీవితంలో వెలుగులు నింపిన సంఘటనలు ఇంటి సభ్యులతో పంచుకోవాలని బిగ్‌బాస్‌ చెప్పాడు. అయితే తాను చేసిన తప్పును, ఇంతవరకు ఎవ్వరికీ తెలియని విషయాన్ని లాస్య వెల్లడించింది.

2010లో నాకు పెళ్లైంది. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఇక్కడకు వచ్చిన తరువాతే రివీల్ చేశా. 2010లో పెళ్లైనా వేరు వేరుగా ఉన్నాం. ఆ సమయంలో మా రెండు ఫ్యామిలీలు పెళ్లికి ఒప్పుకోలేదు. అయితే 2012 నుంచి కలిసి ఉన్నాం. తరువాత 2014 లో నాన్న నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకున్నావని మన కుటుంబంలో ఎవ్వరికీ తెలీదు. ముందు సెటిల్‌ అవ్వండి. మీ కాళ్ల మీద మీరు నిలబడండి అప్పుడు నేనే పెళ్లి చేస్తా అని అన్నారు. దాంతో చాలా ఆనందం వేసింది. ( Bigg Boss 4: సీక్రెట్ టాస్క్‌లో గెలిచిన హారిక.. కెప్టెన్సీ రేస్‌లో ఆ ముగ్గురు)

ఆ తరువాత వారంలో నాకు ఆరోగ్యం బాలేదు. ఆసుపత్రికి వెళ్తే ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఈ విషయాన్ని మేము ఎవ్వరికీ చెప్పలేదు. రెండు రోజులు ఆలోచించుకున్నాం. ఆ తరువాత కడుపు తీసేయించుకున్నా. ఆ ఫైల్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. నా చేతులతోనే నా బేబీని చంపేసుకున్నా. ఆ తరువాత ప్రెగ్నెంట్ అవ్వనేమో అని చాలా బాధేసి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఇక 2017లో అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాక.. ఐదు నెలల తరువాత మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యా. కానీ మిస్ క్యారీ అయ్యింది. 2018లో నా కడుపులో జిన్ను గాడు వచ్చాడు. నా జీవితంలో వెలుగులు నింపాడు. అమ్మా నాన్న అప్పుడు మొదటి బేబీని తీసేసుకున్న విషయం మీకు తెలీదు. ఇప్పుడు చెబుతున్నా. తప్పు ఉంటే క్షమించండి అని లాస్య కన్నీళ్లు పెట్టుకుంది. (ఎర వేసి ఉచ్చులోకి.. హైదరాబాద్‌లో మరో మోసం..)